రాత్రిపూట నిద్రపట్టడం లేదా? అయితే ఇలా చేస్తే సరిపోతుంది

First Published | Aug 18, 2024, 11:50 AM IST

చాలా మంది రాత్రిపూట నిద్రపోవడానికి ఎంతో తిప్పలు పడుతుంటారు. బెడ్ పై అటూ ఇటూ దొరుతూ ఏ అర్థరాత్రికో గానీ నిద్రపోతారు. కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఒకప్పుడు నిద్రరావడం లేదు అనే మాటే వినపడకపోయేది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్ర రావడం లేదని బాధపడుతున్నారు. ఇక నిద్రపట్టడం లేదని గంటలకు గంటలు రాత్రిళ్లు ఫోన్లు చూస్తూ గడుపుతున్నారు. కానీ సరిగ్గా నిద్రపోకపోతే మీరు ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి నిద్రపట్టని వారు రాత్రిపూట ఏం చేస్తే నిద్రపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Sleep Quality

ఆహారంలో మార్పు

మనలో కొంతమంది పెళ్లిళ్లు, ఫంక్షన్లు లేదా రాత్రిపూట హెవీగా తింటుంటారు. ముఖ్యంగా చికెన్, చేపలు, మటన్ వంటి మాంసాహారం తింటుంటారు. కానీ వీటిని రాత్రిపూట అతిగా తింటే తొందరగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, కడుపు అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మీకు నిద్రపట్టదు. ఒకవేళ మీరు మాంసాహారం తినాలనుకుంటే మూడు, నాలుగు గంటలకే తినండి. అప్పుడే మీకు అజీర్థి, నిద్రలేమ సమస్యలు రాదు. అలాగే ఇది మీరు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పడుకునే ముందు కొన్ని నీళ్లను తాగండి. 
 


నిద్రపోయే ముందు స్నానం 

మీకు రాత్రిళ్లు నిద్ర రాకపోతే నిద్రపోయే ముందు స్నానం చేసే అలవాటు చేసుకోండి. ఉబ్బరం వల్ల కూడా నిద్రరాదు. కాబట్టి నిద్రపోవడానికి 15 నుంచి 20 నిమిషాలు లేదా అరగంట ముందు స్నానం చేయండి. ఇది మీ శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. దీంతో మీరు ఖచ్చితంగా నిద్రపోతారు. 


నిద్ర దిశను మార్చడం


ఉత్తరదిశలో పడుకోకూడదని పెద్దలు చెప్పిన మాట గుర్తుండి ఉంటుంది. మూఢనమ్మకం, ఈ దిక్కు పడుకోవడానికి అనువైంది కాదని చెప్పినా.. శాస్త్రీయంగా ఉత్తర దిశలో పడుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. తలను ఉత్తరం వైపు ఉంచి పడుకున్నప్పుడు శరీరంలోని రక్తం నెమ్మదిగా మెదడు వైపుకు లాగబడుతుంది. మెదడుకు రక్తప్రసరణ పెరిగితే నిద్రపోవడం మరింత కష్టమవుతుంది. కాబట్ట ఈ దిక్కులో మాత్రం పడుకోకండి. 

Latest Videos

click me!