జీవితం సంతోషంగా సాగాలనే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం చాలా మంది రేయింభవళ్లు కష్టపడతారు. డబ్బు కాస్త ఎక్కువగా సంపాదిస్తే.. సుఖంగా ఉండొచ్చని, కష్టాలు తొందరగా దరిచేరవు అని భావించేవారు కూడా ఉన్నారు. నిజంగానే మీరు కూడా జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వాలన్నా, సంపాదన పెరగాలన్నా... ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటించాలట. ఆయన చెప్పిన కొన్ని అలవాట్లను కనుక మనం అలవాటు చేసుకుంటే... అతి తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారవచ్చట. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా...