మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. బంధువులకు, స్నేహితులకు ఇలా విషెస్ చెప్పేయండి..

First Published Jan 14, 2024, 6:30 PM IST

Makar Sankranti 2024: సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ కొత్త పంట, కొత్త సీజన్ రాకకు సంకేతం. అలాగే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే ఈ సంఘటనను వివిధ రూపాల్లో జరుపుకుంటారు. పంజాబ్ లో లోహ్రీ గా, దక్షిణ భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని పొంగల్ గా జరుపుకుంటారు.
 

Makar Sankranti 2024: జ్యోతిష విశ్వాసాల ప్రకారం.. సూర్యుడు ధనుస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశించిన సంఘటనను మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను జనవరి 15న జరుపుకుంటున్నాం. సంక్రాంతి ప్రధానంగా సూర్య భగవానునికి అంకితం చేయబడింది. ఈ రోజు సూర్యభగవానుని ఆరాధనకు అంకితం చేయబడింది. మరి ఈ మకర సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
 

Makar Sankranti

మకర సంక్రాంతి ముహూర్తం

సూర్యుడు జనవరి 15 న తెల్లవారుజామున 02:54 గంటలకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతిని జనవరి 15 సోమవారం జరుపుకుంటాం. ఈ రోజు శుభ సమయం ఇలా ఉంటుంది..

మకర సంక్రాంతి పుణ్యకాలం - ఉదయం 07:15 నుంచి 05:46 వరకు

మకర సంక్రాంతి మహా పుణ్యకాలం - ఉదయం 07:15 నుంచి 09:00 వరకు

Latest Videos


1. ఈ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు.. మీ జీవితంలో సుఖసంతోషాలను, సమృద్ధిని, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు

2. సూర్యుని వెచ్చదనం మీ జీవితాన్ని మరింత ఆనందంగా, శ్రేయస్సుతో నింపాలి. హ్యాపీ మకర సంక్రాంతి!

3. ఈ రోజు సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. ఇలాంటి సమయంలో మీ జీవిత ప్రయాణం మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉత్తరాయణం!

4. ఆకాశంలో రివ్వున ఎగిరే గాలిపటాల లాగే మీ మనస్సు కూడా ఆనందంతో ఎగరాలి. హ్యాపీ మకర సంక్రాంతి!

5.  బెల్లం నువ్వుల లడ్డుల్లోని మాధుర్యం మీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మకర సంక్రాంతి!

6. సూర్యభగవాణఉడి కిరణాలు మీకు విజయమార్గాన్ని ప్రకాశింపజేయాలి. హ్యాపీ ఉత్తరాయణం!

7. ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాల్లా మీ కలలు కూడా పైకి ఎగరాలి... హ్యాపీ మకర సంక్రాంతి!
 

makar sankranti 2024

8. ఈ సారి మీరు పండించే పంట మంచి దిగుబడి రావాలని, మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరకుంటూ.. హ్యాపీ మకర సంక్రాంతి!

9. సూర్య భగవానుడి శీస్సులు మీకు ఉజ్వలమైన, సుసంపన్నమైన భవిష్యత్తు వైపు మార్గనిర్దేశం చేయాలి. హ్యాపీ మకర సంక్రాంతి!

10. ఈ పండుగ మీకు మంచి ఆరోగ్యం, సంపద, సంతోషాన్ని తీసుకురావాలి. హ్యాపీ ఉత్తరాయణం!
 

11. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాల లాగే మీ జీవితం ఉత్తేజభరితంగా, ఉల్లాసంగా ఉండాలి. హ్యాపీ మకర సంక్రాంతి!

12. ఈ మకర సంక్రాంతికి మీకు సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు

click me!