మాంసాహారులైనా.. శాఖాహారులైనా పనీర్ ను ఇష్టంగా తింటుంటారు. నిజానికి పనీర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. కానీ కొంతమంది మాత్రం పనీర్ ను అస్సలు తినకూడదు.. తింటే ఈ సమస్యలు వస్తాయి..
ఇంట్లో పండుగైనా.. పార్టీ అయినా పక్కాగా పనీర్ తో చేసిన వంటకాలు గుమగుమలాడుతుంటాయి. పనీర్ తో చేసిన ఎలాంటి వంటకమైనా ఎంతో టేస్టీగా అవుతుంది. పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్లు కూడా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. పనీర్ ను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పనీర్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం దీనిని తినకపోవడమే మంచిది. పనీర్ ను ఎవరెవరు తినకూడదు? ఎందుకు తినకూడదో తెలుసుకుందాం పందండి..
26
డయేరియా
పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ శరీరంలో ఎక్కువైతే వాంతులు, విరేచనాలు అవుతాయి. అందులోనూ మీకు అప్పటికే విరేచనాల సమస్య ఉంటే.. ఆ సమయంలో జున్ను తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే మోషన్స్ పెట్టినప్పుడు మర్చిపోయి కూడా పనీర్ ను తినకండి.
36
రక్తపోటు
అధిక రక్తపోటు సమస్య ఉంటే కూడా పనీర్ ను తినకూడదు. ఎందుకంటే దీనివల్ల రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
46
అలెర్జీలు
ఒక వేళ మీకు పాలు గానీ.. పాల ఉత్పత్తులను వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందా? అయితే మీరు పనీర్ ను తినకపోవడమే మంచిది. ఎందుకంటే పనీర్ ను తింటే కూడా అలెర్జీ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
56
గుండె జబ్బులు
పనీర్ లో కొవ్వు పరిమాణం ఎక్కువుంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
66
జీర్ణ సమస్యలు
ఇప్పటికే మీకు ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలు ఉన్నట్టైతే పనీర్ ను తినడం మానేయండి. ముఖ్యంగా వీళ్లు రాత్రి సమయంలో పనీర్ ను అసలే తినకూడదు. ఒకవ వేళ తింటే అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.