మీ చర్మానికి ఈ పోషకాలు అందుతున్నాయా? లేదంటే చర్మంపై ముడతలొస్తయ్ జాగ్రత్త..

Published : Jul 28, 2022, 04:01 PM IST

ఆరోగ్యకరమైన చర్మం కోసం మన రోజు వారి ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను తప్పక చేర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే చర్మం దెబ్బతింటుంది.   

PREV
16
మీ చర్మానికి ఈ పోషకాలు అందుతున్నాయా? లేదంటే చర్మంపై ముడతలొస్తయ్ జాగ్రత్త..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే చర్మానికి, జుట్టుకు కూడా పోషకాలు చాలా అవసరం. వీటికి పోషకాలు ఎక్కువగా అందితేనే ఆరోగ్యంగా ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయల్లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

26

ఆరోగ్యకరమైన ఆహారాలను తిన్నప్పుడే మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. కొన్ని రకాల ఆహారపదార్థాల్లో చర్మానికి మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జి ఇన్ స్టాగ్రామ్ వేదికగా చర్మానికి మేలు చేసే వివిధ విటమిన్ల గురించి వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36

విటమిన్ సి (Vitamin C)

పోషకాహార నిపుణురాలి ప్రకారం.. అందమైన, బలమైన చర్మానికి విటమిన్ సి అత్యవసరం. విటమిన్ సి లోపించడం వల్లే చర్మం ముడతలు పడుతుంది. పేలవంగా తయారవుతుంది. అందుకే ఈ విటమిన్ లోపించకుండా జాగ్రత్త పడాలి. స్ట్రాబెర్రీలు, జామపండు, పచ్చిమిర్చి, నల్ల ఎండు ద్రాక్షలు, కివి ఫ్రూట్, నారింజ, ద్రాక్షపండ్లు, బచ్చలికూర, క్యాబేజీ, బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుంటే మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. 
 

46

విటమిన్ ఎ (Vitamin A)

ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్ ఎ చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే శరీరం గరుకుగా మారుతుంది. చర్మం పొలుసులుబారుతుంది. గుడ్లు, బ్రోకలీ, గొడ్డు మాంసం, కాడ్ లివర్, గొర్రె కాలెయం, మామిడి పండ్లు, టర్నిప్ ఆకు కూరలు, గుడ్డులోని పచ్చసొన, ఆప్రికాట్లు, గుమ్మడి కాయ, పాలకూర, పీచెస్, బొప్పాయి, క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. 

56

విటమిన్ బి2 (Vitamin B2)

శరీరంలో విటమిన్ బి2 లోపం ఏర్పడితే కింది పెదవిపై చిన్న చిన్న ముడతలు ఏర్పడతాయి. నోటి మూలల్లో పగుళ్లు ఏర్పడతాయి. అలాగే పై పెదవిపై, ముక్కుపై గీతలు కనిపిస్తాయి. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో, కాలెయం, బాదం, ఆవాలు, గుడ్డులోని పచ్చ సొన, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, గోధుమ, ఆకు కూరలు, చికెన్ లో విటమిన్ బి1 పుష్కలంగా ఉంటుంది. 
 

66

విటమిన్ ఇ (Vitamin E)

ఈ విటమిన్ లోపం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. నువ్వుల నూనె, గోధుమ గింజలు, వాల్ నట్స్, కుసుమ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, మొక్క జొన్న నూనె, హాజెల్ నట్స్, ఆలివ్ ఆయిల్, వేరుశెనగ నూనె, సోయాలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories