
మనం తినే ఆహారమే మన శరీరానికి ఇందనం. అందుకే ఇది ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మనం తినే ఆహారమే ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రోటీన్ ఫుడ్ కు బదులుగా బయట దొరికే ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తింటే మాత్రం మీ శరీరం సర్వరోగాలకు ఆవాసంగా మారుతుంది. ఏ పనిచేయడానికి కూడా మీలో శక్తి ఉండదు. అందుకే బయటి ఫుడ్ కు బదులుగా ఇంట్లో ప్రోటీన్ ఫుడ్ ను వండుకుని తినడం మంచిది.
మీరు తినే ప్లేట్ లో రంగు రంగుల్లో ఉండే కూరగాలయలు, రకరకాల పండ్లు, గింజలు, మొలకలు ఉండేట్టు చూసుకోండి. వీటి ద్వారే మీ శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అంటే ఎలాంటి ఆహారాలను తినాలో తెలియడం లేదా.. అయితే ఈ ఆర్టికల్ ను చదివేసి అవేంటో తెలుసుకోండి..
నిమ్మకాయలు
ఒక్క నిమ్మకాయను తీసుకోవడం వల్ల ఒకరోజు మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు ఇది దంతాలు, ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. అన్నింటికి మించి ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా చేస్తుంది. రోజూ మోతాదులో నిమ్మకాయను తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది.
పచ్చి బఠాణీలు
పచ్చి బఠాణీల్లో ఎన్నో పోషకాలుంటాయి. వీటిలో జింక్, ఖనిజాలు, ఇనుము, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను పోగొడుతాయి.
గుడ్డులోని పచ్చసొన
గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేసే వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇది బరువును పెంచుతుందని. నిజానికి ఒక గుడ్డు తినడం వల్ల బరువు పెరిగే అవకాశమే లేదు. నిజానికి పచ్చ సొనలో విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
ఆపిల్స్
ఆపిల్స్ లో అనామ్లజనకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే లక్షణాలను, రోగాల నుంచి కాపాడుతాయి. ఇవి మీ లైఫ్ టైం ను పెంచుతుంది కూడా. అంతేకాదు ఇది గుండె సంబంధిత రోగాల రిస్క్ ను కూడా తగ్గిస్తుంది.
నీళ్లు
వాటర్ ను సర్వ రోగాల నివారిణీ అంటారు కొంతమంది ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే నీళ్లను పుష్కలంగా తాగడం వల్ల శరీరంలోని విషం బయటకు పోతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కూడా తొలగిపోతాయి. అలాగే శరీరంలోని పోషకాలు వివిధ భాగాలకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది. నీళ్లు బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. అంతుకు మించి నీళ్లు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచి.. ఆరోగ్యంగా ఉంచుతాయి.
అవొకాడో
ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే అవొకాడోల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే అమైనో ఆమ్లం గుండె జబ్బులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా ఉంచుతుంది. ఇక దీనిలో ఉండు విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆప్రికాట్లు
ఆప్రికాట్లలో విటమిన్ బీటా కెరోటిన్, పొటాషియం, లైకోపిన్, ఫైబర్, అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలెయానికి సంబంధించిన సమస్యలను పోగొడుతుంది. అలాగే ఇది కాలెయ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది.