Health Tips: ఈ సమస్యలున్న వారు టొమాటోలను అస్సలు తినకూడదు..

Published : Apr 13, 2022, 02:37 PM ISTUpdated : Apr 13, 2022, 02:38 PM IST

Health Tips: టొమాటోలతో చట్నీ, కూరలు, పప్పులు, సాలడ్లు ఇలా ఏది చేసుకుని తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే ఈ టొమాటోలను కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు. 

PREV
16
Health Tips: ఈ సమస్యలున్న వారు టొమాటోలను అస్సలు తినకూడదు..

మనం చేసే ప్రతి వంటలో టొమాటో తప్పకుండా ఉంటుంది. టొమాటోలు వంటలకు ప్రత్యేక రుచిని కలిగిస్తాయి. అందుకే వీటిని ప్రతివంటలో మర్చిపోకుండా వేస్తుంటారు. రుచికే కాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. 

26

టొమాటోలను చట్నీ, కూర, చారు, సలాడ్లు ఇలా ఏది చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటోలను సాలాడ్ గా చేసుకుని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

36

టొమాటోలల్లో పోటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అందుకే వీటిని సలాడ్ల రూపంలో ప్రతిరోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వారు టొమాటోలను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

46

పిత్తాశయం, కిడ్నీలో రాళ్లు.. పిత్తాశయంలో మరియు కిడ్నీల్లో రాళ్ల ఉన్నవాళ్లు టమాటాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ టొమాటోలను తినాలనకుంటే వైద్యుల సలహాలను తప్పక తీసుకోవాలి. అది కూడా టొమాటోల విత్తనాలను తీసేసి. వీటిని తినడం వల్ల రాళ్ల సమస్య మరింత పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

56

కీళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులతో బాధపడేవారు టొమాటోలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టొమాటోలల్లో పులుపు వీరికి అంత మంచిది కాదు. ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతుంది. అయితే ఈ సమస్యలున్నవారు మాత్రమే టొమాటోలను ఎక్కువగా తింటారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కానీ వీరు టొమాటోలను చాలా అంటే చాలా తక్కువ మొత్తంలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. 

66

అతిసారం.. హైడ్రేటెడ్ వెజిటేబుల్స్ లో టొమాటో ఒకటి. అయితే ఈ పండును విరేచనాల సమస్యతో బాధపడుతున్నప్పుడు మాత్రం అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఈ సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి విరేచనాల సమస్య ఉన్న వాళ్లు టొమాటోలను తినకూడదు. 

  
 

Read more Photos on
click me!

Recommended Stories