సెక్స్ వ్యసనం నిజమైనది. అయితే దీన్ని తగ్గించుకోవాలని ఆలోచించకపోవడం, తమది వ్యసనం కాదని మభ్య పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు ఈ సెక్స్ అడిక్షన్ మీ సంబంధాలను, జీవితాన్ని నాశనం చేస్తుంది, మీ ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. సెక్స్ మీ మనస్సు ఎప్పుడూ సెక్స్ చుట్టూనే తిరుగుతూ.. వేరే ఏ ఇతర విషయాలూ దానికంటే ముఖ్య కాదు అనిపించేలా మీరు ఆలోచిస్తున్నట్లైతే.. సాధారణ పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. కొంతమంది లైంగిక వ్యసనపరులు తమకు మానసిక లేదా వైద్య చికిత్స అవసరమని అస్సలు ఒప్పుకోరు. మరి మీరు అందులో ఒకరా? కాదా? తెలుసుకోవాలనుకుంటే ఇది చూడండి.
సెక్స్ కు అడిక్ట్ అయినవాళ్లు తమ భాగస్వాములు తమను తృష్తి పరచలేకపోతున్నారని, తాము కోరుకున్నట్టు ఎక్కువగా లైంగిక చర్యలో పాల్గొనడం లేదని అనుకుంటారట. అందుకే పక్కచూపులు చూస్తారట. దీనివల్ల వీరి బంధంలో దూరం పెరిగిపోతుంది.
నిర్థారణ అయితే తప్ప వినరు..
సెక్స్ వ్యసనపరులు వారి పరిస్థితిని వైద్యపరంగా నిర్ధారిస్తే తప్ప, చికిత్స తీసుకునేంతగా తాము వ్యసనపరులమయ్యాం అనే విషయాన్ని ఒప్పుకోరు. వాదనలకు దిగుతారు. తమ శృంగార కాంక్షను కట్టిపడేయడానికి ఓ విపరీతమార్గంగా ఇలా ఆరోపిస్తున్నారని నమ్ముతారు.
sex addiction
పోర్న్ చూడటం నేరం కాదు
అతిగా పోర్న్ చూడటం లేదా దానికి బానిస కావడం సెక్స్ వ్యసనానికి మరో ప్రధాన సంకేతం. అయితే పోర్న్ చూడటం పెద్ద విషయం కాదని సెక్స్ అడిక్ట్స్ వాదిస్తారు. "ఇది కేవలం ఒక కోరిక, సంతృప్తి చెందడానికి పోర్న్ ఒక మార్గం మాత్రమే" అని వాదిస్తారు.