ఈ పండ్లు తింటే ముఖంపై ముడుతలే కాదు మచ్చలు కూడా రావు.. అంతెందుకు ఎన్నేండ్లైనా మీ చర్మం యవ్వనంగానే ఉంటుంది..

First Published Aug 15, 2022, 10:54 AM IST

 పండ్లు, కూరగాయల ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయితే కొన్ని రకాల పండ్లను తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది. 
 

కూరగాయలు, వివిధ రకాల పండ్లు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వీటిని రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి. ఒకవేళ వీటిని తినకపోతే  శరీరంలో పోషకాల లోపం ఏర్పడి ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. 
 

అయితే ప్రస్తుతం చాలా మంది చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోయారు. హెల్తీ ఫుడ్ కు బదులుగా జంక్ ఫుడ్ ను, ఫాస్ట్ ఫుడ్ ను తింటూ ఆరోగ్యాన్ని చేతురాలా నాశనం చేసుకుంటున్నారు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ కు అలవాటు పడి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ అలవాట్ల వల్ల కూడా తొందరగా వృద్ధాప్యం వస్తుంది. ముఖంపై ముడతలు, తెల్లవెంట్రుకలు, చర్మం వదులుగా అవడం వంటివి జరుగుతాయి. అయితే ఈ చెడు అలవాట్లను విడిచిపెట్టి కొన్ని రకాల పండ్లను రోజూ తింటే మీరు నిత్య యవ్వనంగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికోసం ఎలాంటి పండ్లను  తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్ (Apple)

రోజుకు ఒక యాపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లే అవసరమే లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి. రోజుకు  ఒకే ఒక్క ఆపిల్ పండును తింటే గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి రోగాల ప్రమాదం తగ్గుతుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ ఆపిల్ పండును తినడం వల్ల అదనపు నూనెను వదిలించుకోవచ్చు. దీంతో చర్మం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది. ఆపిల్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. ఇకపోతే పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా కూడా మెరిపిస్తుంది. 
 

దానిమ్మ పండ్లు (Pomegranate)

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఫైన్ లైన్స్,  ముడతలను తగ్గిస్తుంది. ఈ దానిమ్మ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది. పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

దానిమ్మ పండ్లను రోజూ తినడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశమే ఉండదు. ఇది చర్మంపై ముడతలను, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. దానిమ్మ హైపర్ పిగ్మెంటేషన్, వయస్సు వారిగా వచ్చే మచ్చలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

ద్రాక్ష పండు (Grape fruit)

ద్రాక్షల్లో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.  దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.  అలాగే ఈ పండులో ఉండే విటమిన్ సి మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉండే  ద్రాక్ష పండ్లు చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి సహాయపడుతాయి. క్యాన్సర్ కు కారణమయ్యే అతినీలలోహిత కిరణాలు నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. 

click me!