Diabetes symptoms in your feet: పాదాలలో షుగర్ వ్యాధి లక్షణాలు.. నిర్లక్ష్యం చేయకండి..

First Published Aug 15, 2022, 10:01 AM IST

Diabetes symptoms in your feet: ఈ కాలంలో డయాబెటీస్ సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అయితే దీనిని కాళ్లు, పాదాల ద్వారా కూడా గుర్తించొచ్చంటున్నారు నిపుణులు. 
 

డయాబెటీస్ ఎందుకు వస్తుందన్న సంగతి దాదాపుగా అందరికీ తెలుసు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే పరిస్థితినే డయాబెటీస్ అని సింపుల్ గా చెప్పవచ్చు. డయాబెటిస్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండు టైప్ 2 డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఇతర ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలి.
 

అయితే చాలా మంది డయాబెటీస్ ను లేట్ గా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధిని కాళ్లు, పాదాలపై కనిపించే కొన్ని లక్షణాల ద్వారా కూడా గుర్తించొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ మధుమేహం వల్ల పాదంలో డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ వాస్కులర్ సిసీజ్ అనే సమస్యలు వస్తాయి. ఈ డయాబెటిక్ న్యూరోపతి లో నియంత్రణ లేని మధుమేహం నరాలను దెబ్బతీస్తుంది. అయితే పెరిఫెరల్ వ్యాస్కులర్ రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో పాదాలలో డయాబెటీస్ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే.. 
 

కాళ్లు, పాదాలలో నొప్పి, తిమ్మిరి, జలదరింపు

డయాబెటిక్ న్యూరోపతి వల్ల మధుమేహుల పాదాలు, కాళ్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో కాళ్లు, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, నొప్పి  ఉంటుంది. అలాగే రక్తనాళాలు, జీర్ణ వ్యవస్థ, గుండె కు సంబంధించిన సమస్యలు వస్తాయి. 

మధుమేహుల్లో వచ్చే ఫుట్ అల్సర్ల గురించి చాలా మందికి తెలియదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో సుమారు 15 శాతం మందిలో కనిపిస్తుంది. ఇది పాదం అడుగు భాగంలోనే కనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని సందర్బాల్లో పాదాల పూతల వల్ల చర్మం అరిగిపోతుంది. దీంతో పుండ్లు అవుతాయి. ఇవి అంత తొందరగా నయం కావు. 
 

diabetes

'అథ్లెట్స్ ఫుట్' అనేది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల దురద పెట్టడం, పగుళ్లకు దారితీస్తాయి. అయితే ఈ లక్షణాలు ఒక పాదం లేదా రెండు పాదాల్లో కనిపించవచ్చుు. ఈ సంక్రమణకు కారణమయ్యే ఫంగస్ ను మందులతో వదిలించుకోవచ్చు. 

diabetes

డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో గోళ్లపై కూడా సంకేతాలు కనిపిస్తాయి. దీనినే  'ఒనికోమైకోసిస్' అంటారు. ఇది ఒక రకమైన ఫంగల్  ఇన్ఫెక్షన్.  ఇది కాలి గోళ్లను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గోర్ల రంగు మారడం, గోర్లు పెళుసులుగా అవుతాయి. దీనిని ఈజీగా గుర్తించవచ్చు. ఎలా అంటే ఇది అన్ని గోర్లకంటే డిఫరెంట్ గా ఉంటుంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఆ గోరు విరిగిపోవచ్చు. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ గాయం వల్ల ఇలా అవుతుంది. 

డయాబెటిస్  కాలి వేళ్లకు ఆక్సిజన్  ను, రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను ప్రభావించం చేస్తుంది. దీంతో  రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల కణజాలం చనిపోతుంది. ఇదికాస్త గ్యాంగ్రీన్ కు దారితీస్తుంది. 
 

డయాబెటీస్ వల్ల నరాల సష్టం కలుగుతుంది. అంతేకాదు ఇది పాదాలలోని కండరాలను బలహీనపరుస్తుంది. దీంతో పాదాల ఆకారం పూర్తిగా మారుతుంది. 
 

click me!