బ్రెస్ట్ సైజ్ పెరగాలా.. అయితే వీటిని తినండి

Published : Oct 24, 2022, 03:53 PM IST

రొమ్ముల పరిమాణం చిన్నగా ఉంటే.. తమలో ఏదో లోపం ఉందని.. అందంగా కనిపించమని భావించేవారు చాలా మందే ఉంటారు. అయితే కొన్ని ఆహారాలను తింటే బెస్ట్ర్ సైజు పెరుగుతుంది.   

PREV
18
బ్రెస్ట్ సైజ్ పెరగాలా.. అయితే వీటిని తినండి
breast size

కొంతమందికి రొమ్ముల సైజు పెద్దదిగా ఉంటే.. ఇంకొంతమంది ఆడవారికి మరీ చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటే మాలో ఏదో లోపం ఉంది అని భావించే వాళ్లు చాలా మందే ఉన్నారు. దీనివల్ల అందం తగ్గుతుందని కూడా భావిస్తుంటారు. కానీ చాలా మంది ఆడవాళ్లకు పెద్దగా, బిగుతుగా ఉండే రొమ్ములంటేనే ఇష్టం. అయితే అందరికీ ఇలా ఉండదు. చిన్నగా ఉన్నాయని బాధపడేవారు కొన్ని ఆహారాలను తింటే బ్రెస్ట్ సైజ్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రొమ్ము పరిమాణాన్ని పెంచడానికి ఈస్ట్రోజెన్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం పదండి.

28

సోయా ఉత్పత్తులు

సోయా పాలు, సోయాబీన్, టోఫు, జున్ను వంటి సోయా ఉత్పత్తుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే వీటిలో ఉండే  isoflavones ఈస్ట్రోజెన్ లాగా పనిచేస్తాయి. అలాగే ఇవి రొమ్ముల సైజును పెంచడానికి సహాయపడతాయి. 

 

38

రొయ్యలు, కొవ్వు చేపలు 

రొయ్యలు మొదలైన సముద్ర చేపలల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. వీటిని తరచుగా తింటే రొమ్ము పరిమాణం పెరగడం మొదలవుతుంది. 

48

మెంతులు

మెంతుల్లో ఫైటోఎస్టేజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల రొమ్ములకు పోషణ బాగా చేరుతుంది. ఇందుకోసం మెంతులను నానబెట్టిని నీటిని తాగాలి.  
 

 

58

పాలు 

పాలను రెగ్యులర్ గా తాగితే  హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. ఇవన్నీ బ్రెస్ట్ పెరిగేందుకు దోహదపడతాయి.
 

68

లీన్ మీట్ 

లీన్ మీట్ కూడా రొమ్ముల పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 
 

78

విత్తనాలు

విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని హార్మోన్లను మెరుగుపరుస్తుంది. అలాగే నియంత్రిస్తుంది. అందుకోసమే మీ ఆహారంలో పొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజలు,  గుమ్మడి గింజలు, నువ్వులు మొదలైన వాటిని చేర్చుకోండి. వీటిని మీరు చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. 
 

88

మసాజ్ కూడా రొమ్ము పరిమాణాన్ని బాగా పెంచుతుంది. ఇందుకోసం రెగ్యులర్ గా బ్రెస్ట్ మసాజ్ చేయాలి. దీనివల్ల కండరాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రొమ్ముల కండరాలు కూడా పెరుగుతాయి. దీని వల్ల రొమ్ముల సైజు రోజు రోజుకు పెరుగుతుంది. మసాజ్ కోసం కొబ్బరినూనె, ఆవనూనె, ఆముదం నూనె లేదా ఆలివ్ నూనెను ఎంచుకోండి. మసాజ్ చేయడానికి ముందు నూనెను గోరువెచ్చగా చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories