పర్పుల్ కలర్ లో ఉండే క్యాబేజీని చూసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. నిజానికి ఆకుపచ్చ క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఊదారంగు క్యాబేజీ 'బ్రాసికేసి' కుటుంబానికి చెందినది. ఒక కప్పు అంటే 89 గ్రాముల పర్పుల్ క్యాబేజీలో కేవలం 28 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే దీనిని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ కూరగాయ అని చెప్పొచ్చు. 89 గ్రాముల పర్పుల్ క్యాబేజీలో 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల డైటరీ ఫైబర్స్, 1 గ్రా ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, ఐరన్ , మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.