Acne Problem: ఈ కారణాల వల్లే ముఖంపై మొటిమలు వస్తయ్..

Published : Apr 21, 2022, 12:39 PM IST

Acne Problem: కంటినిండా నిద్రలేకోపోవడ, పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి.   

PREV
17
Acne Problem: ఈ కారణాల వల్లే ముఖంపై మొటిమలు వస్తయ్..
Acne_problem

Acne Problem: టీనేజర్లను ఎక్కువగా వేధించే సమస్యల్లో మొటిమలు (Pimples) ఒకటి. ఈ సమస్య ఒక్క అమ్మాయిలకే పరిమితం కాలేదు.. అబ్బాయిల్లోనూ కనిపిస్తుంటుంది. దీంతో ఎంత అందంగా ఉన్నా అందవిహీనంగానే కనిపిస్తుంటారు. ఇక ముఖంపై మొటిమలు వచ్చాయని చాలా మంది ఇండ్ల నుంచి బయటకు రావడమే మానేస్తుంటారు. వాటిని తగ్గించడానికి మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. అయినా ఇవి అంత తొందరగా తగ్గవు. 

27

పోషకాహారం తీసుకోకపోవడం, ముఖం జిడ్డుగా ఉండటం, వ్యాయామం చేయకపోవడం, కంటి నిండా నిద్రలేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల  చర్మ పొరల కింద ఉండే కొవ్వు పొరల్లో Imbalance అవుతుంది. దీంతో కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడటం, ముఖంపై మొటిమలు రావడం, వైట్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యలు రాకూడదంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

37
acne

టీనేజ్ లో ఉండే పిల్లల్లో హర్మోన్లు కొన్ని కొన్ని సందర్భాల్లో అసమతుల్యంగా మారుతుంటాయి. దీంతో ముఖంపై మొటిమలు వస్తాయి. ఇలా జరగకూడదంటే నిత్యం యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం, పుస్తకాలను చదవడం వంటివి చేస్తూ ఉండాలని నిపుణులు సలహానిస్తున్నారు. 

47

లేట్ గా నిద్రపోవడం.. లేట్ గా లేవడం.. ప్రస్తుత కాలంలో ఈ అలవాటు చాలా మందికే ఉంటుంది. రాత్రంగా ఫోన్లలో గడిపి ఏ అర్థరాత్రో లేకపోతే రెండు మూడింటికో పడుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి వారిలో హార్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. దీంతో వారు మొటిమల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రుళ్లు త్వరగా పడుకుని.. త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. 
 

57

నీరు తాగడం.. మన శరీరానికి సరిపడా నీళ్లను తాగినప్పుడే మనం హెల్తీగా ఉంటామని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే  రోజూ ఖచ్చితంగా 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. అప్పుడే చర్మం తాజాగా, ఎలాంటి మచ్చలు లేకుండా నీట్ గా ఉంటుంది. అంతేకాదు తగినన్ని నీళ్లను తాగడం వల్ల మన ఒంట్లో ఉండే విషపదార్థాలు కూడా బయటకు పోతాయి. అంతేకాదు నీరు మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. 
 

67

మైదా పిండి తో చేసిన ఆహారాలు.. పిండితో చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ముఖ్యంగా మైదా పిండికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మైదాపిండితో చేసిన ఆహారాలు.. ఎక్కువ సేపు పేగులను అంటిపెట్టుకునే ఉంటాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది. 

77

పానీయాలను తీసుకోవాలి.. ప్రిజర్వేటీవ్ లు  , Artificial sugar లు ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి వీటికి బదులుగా మజ్జిగ, తాజా పండ్లు, పెరుగు, లస్సీ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. 

Read more Photos on
click me!

Recommended Stories