దేశంలో నిమ్మకాయ ధర ఇంతలా పెరగడానికి అసలు కారణం ఇదే..

Published : Apr 21, 2022, 11:45 AM IST

Lemon Price Rise: మండే ఎండలకు చల్లని నిమ్మరసం చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని తాగడం వల్ల వేసవి దాహం తీరడమే కాదు వేడి నుంచి కూడా ఉపశమనం కలిగుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. కానీ ప్రస్తుతం నిమ్మధర ఆకాశాన్నంటుతోంది. సామాన్యుడు, మధ్యతరగతి వాడికి ఇవి అందని ద్రాక్షలా మారిపోయాయి. అసలు ఇవి అంతలా ధర ఎందుకు పెరిగిందో తెలుసా..?  

PREV
19
దేశంలో నిమ్మకాయ ధర ఇంతలా పెరగడానికి అసలు కారణం ఇదే..

Lemon Price Rise: మనకు విరివిగా దొరికే వాటిల్లో నిమ్మకాయ ఒకటి. చూడటానికి చిన్నగా ఉన్నా ఇది మనకు దివ్య ఔషదంతో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.  ముఖ్యంగా ఈ సీజన్ లో నిమ్మరసం కలిపిన నీళ్లను ఉదయం పూట తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయే అవకాశం ఉండదు. పైగా కిడ్నీలో రాళ్లు రాకుండా చేసేందుకు లెమన్ వాటర్ ఎంతో సహాయపడుతుంది. 

29

ఈ వేసవిలో మనకు నిమ్మకాయ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే నిమ్మకాయ శరీర వేడిని తగ్గించడంతో పాటుగా వేడి వాతావరణం నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. రీఫ్రెష్ గా కూడా ఉంచుతుంది. వేసవి దాహాన్ని కూడా తీర్చుతుంది. కానీ ప్రస్తుతం నిమ్మ ధరలు ఆకాశానంటున్నాయి. ఇంకేముందు పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతి వానికి ఇవి అందని ద్రాక్షలాగే తయారయ్యాయి. 

39

ప్రస్తుతం మన దేశంలో రిటైల్ కిలో నిమ్మకాయ ధర 300 నుంచి 400 రూపాయలుగా ఉంది. హోలో సేల్ మార్కెట్ వాల్యూ అయితే కిలోకు 120 నుంచి 150 రూపాయల మధ్యన కొనసాగుతోంది. అంటే మీడియం సైజు నిమ్మకాయ ఇప్పుడు రూ.10 నుంచి 15 రూపాలకు లభిస్తోందన్న మాట. 
 

49

పెట్రోల్ , డీజిల్ రేట్లు పెరిగినప్పుడు వీటిని  పెళ్లిళ్లకు ఎలా అయితే బహుమతిగా పెడుతుంటారో.. అలాగే ఇంత ఖరీదైన రెండు నిమ్మకాయ పెట్టెలను.. గుజరాత్ లో పెళ్లి చేసుకోబోతున్న ఓ వ్యక్తి తన హల్దీ వేడుకల్లో బహుమతిగా పొందాడు కూడాను. ఇలా బహుమతిగా ఇవ్వడానికి కారణం లేకపోలేదు.. వేసవిలో నిమ్మకాయలు చాలా అవసరమైనవి. ఇలాంటి సమయంలోనే వీటి ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశ్యంతోనే వీటిని బహుమతిగా ఇచ్చారు. నిమ్మకాయ ధరలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

59

ఎక్కువ డిమాండ్.. తక్కువ సప్లై.. నిమ్మకాయ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఇదే. ఈ వేసవి ముందుగానే రావడం వల్ల గిరాకీ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు ఆశించినంతగా చేతికి రాలేదు. ముఖ్యంగా నిమ్మకాయలు ఎక్కువగా పండే గుజరాత్ లో తుఫాను కారణంగా పంట అంతా దెబ్బతిన్నది. 

69

దీనికి తోడు ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేడి గాలుల వల్ల నిమ్మపిందెలు రాలిపోతున్నాయి. అంతేకాదు బలమైన గాలుల వల్ల కూడా నిమ్మ పూత రాలిపోతోంది. దీనివల్లే నిమ్మ ఉత్పత్తి తగ్గింది. 

 

79
lemon

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నిమ్మకాయల సాగు బాగుంటుంది. ఇక్కడి నుంచే నిమ్మకాయలు ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి. కానీ ప్రస్తుతం వేడిగాలులు వీస్తుండటంతో పంట దెబ్బతింటుంది. 

89
=

ఇందన ధరలు పెరగడం.. దేశ వ్యాప్తంగా ఇందన ధరలు విచ్చల విడిగా పెరుగుతున్నాయి. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ , డీజిల్ ధరలు దారుణంగా పెరిగాయి. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా బారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఇందన రేటు పెరగడంతో సరుకు రవాణా 15 శాతం పెరిగింది. ఇది సామాన్యుల జేబుకు చిల్లు పెడుతుందనే చెప్పాలి.  

99

ఇది ముందే పెళ్లిళ్ల సీజన్. ఇలాంటి పరిస్థితిలో నిమ్మకాయకు డిమాండ్ బాగా పెరిగింది. అయినా ప్రస్తుతం నిమ్మకాయకు డిమాండ్ ఎక్కువగా ఉండి.. ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. ముందే ఇది వేసవి కాలం. వేసవి తాపం తీర్చుకోవడానికి నిమ్మకాయ పక్కాగా ఉండాల్సిందే. అలాగే రంజన్ మాసం కావడంతో ఉపవాసంలో ముస్లిం సోధరులు కూడా నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సామాన్యులు వీటిని కొనడానికి వెనకాడుతున్నారనే చెప్పాలి. 

click me!

Recommended Stories