Periods : పీరియడ్స్ సమయానికి కావడం లేదా? కారణం ఇదే కావొచ్చు..

Published : Apr 18, 2022, 03:24 PM IST

Periods : రక్తహీనత సమస్య వచ్చిన ఆడవాళ్లలోనే పీరియడ్స్ టైమింగ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు థైరాయిడ్, అధిక బరువు, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల పీరయడ్స్ క్రమం తప్పుతాయి. 

PREV
18
Periods : పీరియడ్స్ సమయానికి కావడం లేదా? కారణం ఇదే కావొచ్చు..

Periods : చాలా మంది ఆడవారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో నెలసరి వచ్చే ముందు కనిపించే కడుపు నొప్పి, తిమ్మిరి, కాళ్ల లాగడం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిస్తాయి. కానీ పీరియడ్స్ మాత్ర కావు. ఈ సమస్య మరెన్నో హెల్త్ ఇష్యూస్ కు దారి తీస్తుంది. అందుకే ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

28

నెలసరి సమయానికి రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మానసికంగా ఇబ్బంది పడటం, ఒత్తిడి, శరీర అలసట, పని ఎక్కువ చేయడం వంటి వాటివల్ల కూడా పీరియడ్స్ టైమింగ్స్ మిస్ అవ్వొచ్చు. వీటితో పాటుగా థైరాయిడ్, ఓవర్ వెయిట్, జన్యుపరమైన లోపాలు, ఉబ్బసం వంటి కారణాల వల్ల కూడా ఇలా జరగొచ్చు. 
 

38

పీరియడ్స్ మిస్ అవ్వడానికి కుటుంబ నియంత్రణ మాత్రల వల్ల కూడా అయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్, Polycystic ovary syndrome వంటి సమస్యల కారణంగా కూడా పీరియడ్స్ లేట్ గా అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

48

తీవ్రమైన ఒత్తిడి సమస్యతో బాధపడుతున్న ఆడవారిలో కార్టిసార్ లెవెల్ అధికమవుతుంది. దీంతో హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. దీంతో నెలసరి క్రమం తప్పే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. 

58

కాఫీలను ఎక్కువగా తాగడం, మెడిసిన్స్ ను యూజ్ చేయడం, బరువు తగ్గడం, ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం, పోషకాలలేమి వంటి వాటివల్ల కూడా నెలసరి తప్పే అవకాశముంది. 
 

68

నెలసరి రాకపోవడానికి మరో కారణం రక్తహీనత (Anemia). ఒంట్లో ఐరన్ లోపం ఏర్పడితే రక్తహీనత సమస్య బారిన పడతారు. ఐరన్ లోపించినప్పుడు శరీరం బలహీనపడుతుంది. దీంతో నెలసరి రాకపోవడమో.. లేట్ గా రావడమో వంటివి జరుగుతాయి. కాబట్టి ఐరన్ పుష్కలంగా లభించే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. 
 

78

షుగర్, కడుపు సంబంధిత వ్యాధులో, అధిక రక్తపోటు, కుంగుబాటు వంటి కారణాల వల్ల కూడా నెలసరి మిస్ అయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 

88

ముఖ్యగా పేగులు అనారోగ్యంగా ఉండే ఆడవారు ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కసరత్తులు ఎక్కువగా చేసే వారు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తారని చెబుతున్నారు. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories