Health tips: ఇప్పుడున్న కాలంలో చిన్నపిల్లలు సైతం స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడుతున్నారు. ఈ అలవాటు తల్లిదండ్రులే నేర్పిస్తున్నారని మొదట చెప్పాలి. అందుకే పిల్లల విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
నేటి కాలంలో పిల్లలతో మనకు ఎదురయ్యే ప్రధాన సమస్య స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్. ఇవి నిర్దిష్ట సమయంలో ఆడితే పర్వాలేదు కానీ వీటికి ఎడిక్ట్ అయినా పిల్లలు గంటల తరబడి వాటిని చూస్తూనే ఉంటున్నారు.
27
తల్లిదండ్రులు కూడా వాళ్లని డిస్టర్బ్ చేయడం లేదు కదా అని తగిన శ్రద్ధ చూపించడం లేదు. తీరా జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు గగ్గోలు పెట్టి లాభం ఏముంది. అందుకే తల్లిదండ్రులు ముందే మేలుకోండి.
37
ఒకటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మరింత జాగ్రత్త వహించండి. ఎందుకంటే పిల్లలు అన్నం తినటం లేదని మారం చేస్తున్నారని ఫోన్లను అలవాటు చేస్తుందే తల్లిదండ్రులు. అందుకే వాళ్లకి ఫోన్లు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి.
47
గంటకు మించి వాళ్లు స్మార్ట్ ఫోన్ గాని కంప్యూటర్ గాని చూడకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారిని ఒంటరిగా వదిలేయకుండా వాళ్లతో గడిపితే వాళ్ల దృష్టి కాస్త స్మార్ట్ ఫోన్ మీద నుంచి తల్లిదండ్రులతో ఆడుకోవడం మీద పడుతుంది.
57
ఆ విధంగా వాళ్లని స్మార్ట్ ఫోన్ నుంచి దృష్టి మళ్లించవచ్చు. ముఖ్యంగా ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న శిశువులకి ఎలక్ట్రానిక్ స్క్రీన్ లను పెట్టు పరిస్థితులలోనూ దగ్గరగా ఉంచకండి. వీటి రేడియేషన్ ప్రభావం శిశువులపై తీవ్రంగా ఉంటుంది.
67
ఇదే విషయాన్ని హెచ్చరిస్తుంది డబ్ల్యూహెచ్ఓ. గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం వల్ల స్థూలకాయం, ఫిజికల్ గా యాక్టివ్గా లేకపోవడం మన బుద్ధి రావడం జరుగుతుంది. అందుకే వాళ్లకి రోజుకి కనీసం మూడు గంటలు వ్యాయామం చేసేలాగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.
77
ఏడాదిలోపు శిశువులతో నేలపై ఆటలు ఆడించాలి. తల్లిదండ్రులు పిల్లల మీద కాస్త దృష్టి పెడితే వాళ్లను డిజిటల్ స్క్రీనింగ్ కి దూరంగా ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు కాస్త ప్రయత్నించి చూడండి.