Tulsi Water: ప్రతిరోజూ తులసి నీళ్లు తాగితే మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే

Published : May 20, 2026, 05:45 PM IST

Tulsi Water: తులసి మొక్కలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది.  ప్రతిరోజూ తులసి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయి. అవి తెలిస్తే ఈరోజే తులసి నీరు తాగడం మొదలుపెడతారు.

PREV
14
తులసి నీటితో ఆరోగ్యం

మనదేశంలో తులసి మొక్కను దేవత రూపంలో కొలుస్తారు. ప్రతి హిందూ భక్తుడి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. లక్ష్మీదేవి తులసి మొక్క రూపంలో మారిందని చెప్పుకుంటారు. ఆయుర్వేద పరంగా చూసుకుంటే తులసి ఎన్నో రకాల ఔషధగుణాల గని. తులసి ఆకుల నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ప్రతిరోజూ తులసి నీళ్లు తాగితే శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి.  ఇందులో యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.

24
రోగనిరోధక శక్తికిి

తులసి నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి  వస్తుంది. రోజూ తులసి నీళ్లు తాగడం వల్ల ఆస్తమా వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు.

34
దగ్గుకు మంచి మందు

కొందరికి దగ్గు తరచూ వస్తుంది.  ఎడతెరిపి లేకుండా ఆగకుండా వచ్చే దగ్గును తగ్గించడానికి తులసి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి వారు తులసి నీళ్లను ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించాలి. కొన్నిరోజులకే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

44
డీహైడ్రేషన్‌కు చెక్

వేసవిలో శరీరంలో డైహైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. దీనికి తులసి నీళ్లు తాగడం మంచి పద్దతి. ఇది డీహైడ్రేషన్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి కూడా తులసి నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. దీన్ని టీలో కలుపుకుని కూడా తాగొచ్చు. నీళ్లలో తులసి ఆకులను వేసి కాసేపు మరిగించి వడకట్టి ఆ నీటిని తాగేస్తే సరిపోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories