ఈ 5 రకాల టీ లతో పొడవైన జుట్టే కాదు అదిరిపోయే అందం మీ సొంతం..!

First Published Jul 2, 2022, 11:51 AM IST

టీ లు చాలా రకాలు. అందులో కొన్ని రకాల టీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే.. మరికొన్ని హాని చేస్తాయి. అయితే ఐదు రకాల టీలు మాత్రం జుట్టును పొడుగ్గా చేయడంతో పాటుగా మిమ్మల్ని అందంగా తయారుచేస్తాయి.

టీ తాగితే ఎనర్జిటిక్ గా మారిపోతారు. మూడ్ కూడా బాగుంటుంది. అలసట వదిలిపోతుంది. మనిషి హుుషారుగా తయారవుతారు. అందుకే ప్రతిరోజూ ఉదయాన్ని ఒక కప్పు టీతో మొదలు పెట్టేవారు చాలా మందే ఉన్నారు. అయితే మన ఆరోగ్యానికి హెర్బల్ టీలు ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో మూలికలతో తయారుచేసిన టీలకు బలే క్రేజ్ కూడా ఉంది. ఇవి మనల్ని రిఫ్రెష్ చేయడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అయితే 5 రకాల టీలు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేయడంతో పాటుగా జుట్టును పొడుగ్గా, సిల్కీగా, బలంగా చేస్తాయి. ఆ టీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

పుదీనా టీ (Peppermint tea)

పుదీనా టీ మన ఆరోగ్యానికే కాదు, చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కంగా ఉంటాయి. ఇవి మొటిమల అయ్యే చర్మంపై ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. ఈ టీ లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు ఫోలికల్స్ రంధ్రాలను మూసేసే బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఈ టీని నెత్తి శుభ్రం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
 

డాండెలైన్ టీ (Dandelion tea)

డాండెలైన్ టీని డాండెలైన్ మొక్క మూలం నుంచి తయారు చేస్తారు. ఇది స్కిన్ కు, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఈ హెర్బల్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది. ఇక ఈ టీలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,  ఫాస్పరస్,  బయోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టును పొడుగ్గా చేయడంలో సహాయపడతాయి. 

గ్రీన్ టీ (Green tea)

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే శరీరం, చర్మం నుంచి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక దీనిలో ఉండే ఫైన్ లైన్స్ ముడతలను తగ్గిస్తాయి. అలాగే ఈ టీలో ఉండే టానిన్లు మీ జుట్టును అందంగా తయారుచేస్తాయి. పొడి మాడు సమస్యను తగ్గించడంలో కూడా  సహాయపడతాయి.

గులాబీ టీ (rose tea)

గులాబీ ఆకులతో తయారుచేసిన టీ కూడా చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించడమే కాకుండా.. వృద్ధాప్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ బి3, మిటమిన్ సి లు ఈ టీలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

మందార పువ్వు టీ (Hibiscus flower tea)

మందార పువ్వులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని శారీరక ఆరోగ్యానికి, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎన్నోశతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.  దీనిలో హైడ్రేటింగ్ గుణాలుంటాయి. ఇవి డ్రై స్కిన్ సమస్యను తొలగిస్తాయి. అలాగే దురద సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ పువ్వులో అమైనో ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. 

click me!