vegetables: ఈ కూరగాయలను తింటే మీ బాడీ చల్లగా ఉంచటమే కాదు.. మీ ఆరోగ్యానికి కూడా ఏ ఢోకా ఉండదు..

Published : May 05, 2022, 03:13 PM IST

vegetables: ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ తీవ్రమైన ఉక్కపోతను తట్టుకోవడం చాలా కష్టం. ఎంత ఏసీలో ఉన్నా, ఫాన్ల కింద  కూర్చున్నా శరీర ఉష్ణోగ్రత మాత్రం తగ్గదు. అయితే కొన్ని రకాల కూరగాయలతో శరీర ఉస్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. 

PREV
16
vegetables: ఈ కూరగాయలను తింటే మీ బాడీ చల్లగా ఉంచటమే కాదు.. మీ ఆరోగ్యానికి కూడా ఏ ఢోకా ఉండదు..

vegetables: ఈ వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు రకరకాల ఫ్రూట్ జ్యూస్ లను, కూల్ డ్రింక్ లను తీసుకుంటూ ఉంటారు. ఉక్కపోతలకు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చుంటారు. అయినా శరీరం మాత్రం చల్లబడదు. అయితే కొన్ని రకాల  సీజనల్ కూరగాయలతో  శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. ఈ కూరగాయలు మీ బాడీని కూల్ గా ఉంచడమే కాదు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా కూడా ఉంచుతాయి. మరి ఈ సీజన్ లో ఎలాంటి కూరగాయలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

26

దోసకాయ.. దోసకాయలో విటమిన్ సి. విటమిన్ కె, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో నీటిశాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మిమ్మల్ని కూల్ గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. ఈ దోసకాయను అలాగే లేదా సలాగ్ గా తీసుకోవచ్చు. కానీ వేసవిలో ఈ పండును ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

36

సొరకాయ.. సోరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో నీటి శాతం ఎక్కువే. దీనిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారుచేస్తుంది. అంతేకాదు దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ లో  షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటుగా జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి కూడా సహాయపడతుంది. 

46

గుమ్మడికాయ.. గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఎ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఇది ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిండెంట్ గా మారి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇది మీ బాడీ చల్లగా ఉండేలా చేస్తుంది. 

56

కాకరకాయ.. కాకరకాయ చేదుగా ఉన్నా.. దీనిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. అలాగే జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాకరకాయ రసం హార్ట్ ప్రాబ్లమ్ నుంచి మనల్ని రక్షించడంతో పాటుగా పొట్ట సంబంధిత సమస్యలు రాకుండా రక్షిస్తుంది. 

66

పచ్చి బఠానీలు.. పచ్చి బఠానీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్ డైట్. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. వీటిని వేయించుకుని లేదా ఉడికించి కూడా తినొచ్చు. 

click me!

Recommended Stories