మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. జాగ్రత్తగా ఉండండి..

Published : May 05, 2022, 02:23 PM ISTUpdated : May 05, 2022, 02:26 PM IST

మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఐదు లక్షణాలు కనిపిస్తాయి. అవే మీ హెల్త్ ను ప్రమాదంలో పడేయకుండా కాపాడుతాయి.   

PREV
17
మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. జాగ్రత్తగా ఉండండి..

రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం లేదా తగ్గడం రెండూ మంచివి కావు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మన శరీరంలో షుగర్ లెవెల్స్ 80- 110 మధ్య ఉండాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ 90mg ని సగటుగా భావిస్తారు. 

27

వాస్తవానికి షుగర్ రక్తంలో ఎక్కువగా ఉండటం వల్లే కాదు.. తక్కువగా ఉంటే కూడా ప్రమాదరకమే. రక్తంలో షుగర్ తక్కువగా ఉండటం వల్ల బలహీనంగా మారడం, మైకము కమ్మడం, గందరగోళంగా అనిపించడం, కాళ్లు చేతుల్లో చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక వేల మీ శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగినా, తగ్గినా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటంటే.. 

37

టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు తరచుగా మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ ను చెక్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ రక్తంలో  షుగర్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

47

తరచుగా మూత్రవిసర్జన, దాహం వేయడం..మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం, అతిగా దాహం వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మీ కిడ్నీలు షుగర్ ను ఫిల్టర్ చేయడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువ ద్రవాలను తీసుకుంటారు. దీంతోనే మీరు మాటిమాటికి మూత్రానికి వెళతారు. శరీరంలో ద్రవాలు తగ్గడంతో మీకు తరచుగా దాహం అవుతుంది. ఒకవేళ మీరు నీళ్లను తాగకపోతే మాత్రం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. 

57
Fatigue

అలసటగా అనిపిస్తుంది.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేనప్పుడు మీరు అలసిపోతారు. ఎందుకంటే ఆ సమయంలో షుగర్ కణాలలోకి కాకుండా రక్త ప్రవాహంలో ఉంటుంది. ఆ సమయంలో కండరాలకు తగినంత శక్తి లభించదు. దీంతో మీరు అలసిపోయినట్టుగా కనిపిస్తారు. అలాంటి సమయంలో మీరు కొద్ది సేపు  పడుకుంటే అలసట తగ్గుతుంది. మీకు తెలుసా.. మధుమేహులు తిన్న తర్వాత చాలా ఫాస్ట్ గా నిద్రలోకి జారుకుంటారు. 

67

మైకము లేదా వణుతున్నట్టుగా నిపిపించడం.. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు మైకము కమ్మడం లేదా చేతులు వణుకుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది హైపోగ్లైసీమియాకు సంకేతమే. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గితే మీ మెదడు సరిగ్గా పనిచేయలేదు. అలాంటి సమయంలో మీరు ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ను తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. తరచుగా మైకము కమ్ముతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం బెటర్. 

77

కాళ్లు, చేతులు వాపు రావడం.. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారి శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. అంతేకాదు మీ శరీరంలో నీటిశాతం పెరిగితే మీ కాళ్లు, చేతులు వాస్తాయి. ఈ వాపు కిడ్నీల వ్యాధికి కారణం కావొచ్చు. అంతేతకాదు కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింటుంది. మీ డైట్ లో కొన్ని మార్పులను చేసుకుంటే ఈజీగా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

click me!

Recommended Stories