జస్ట్ ఈ మూడు జ్యూస్ లు చాలు మీ ఆరోగ్యం పదిలంగా ఉండటానికి..

First Published Sep 19, 2022, 12:55 PM IST

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడమే కాదు.. హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం కూడా ముఖ్యమే. అందులోనూ మూడు జ్యూస్ లు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. వీటిని తాగితే మన ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

హెల్తీ ఫుడ్ తోనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్ లు ఎన్నో రోగాలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది హెల్తీ జ్యూస్ లకు బదులుగా కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, చక్కెర పదార్థాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తాయి. వీటికి బదులుగా కొన్ని రకాల కూరగాయలు, పండ్ల రసాలను తాగండి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందుకోసం ఎలాంటి జ్యూస్ లను తాగాలో తెలుసుకుందాం పదండి. 
 

తులసి ఆకుల రసం

తులసిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే ఈ ఆకులను రోజూ కొన్ని నమలండని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. తులసి ఆకుల రసం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల ఎసిడిటీ, బ్రోన్కౌటిస్, దగ్గు, జ్వరం, జలుబు వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అయితే కృష్ణ తులసే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

తులసి ఆకులను రసం నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.  ఇందుకోసం రాత్రంతా నానబెట్టిని వాటర్ తో దంతాలను తోముకోవాలి. అయితే నోటి దుర్వాసన పోవాలంటే కొన్ని తులసి ఆకులను నమిలినా చాలు. అయితే తులసి ఆకులు గొంతు నొప్పిని కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మీకు తెలుసా.. తులసి ఆకులు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తాయి. అంతేకాదు నిద్రలేమి సమస్యలను కూడా పోగొడుతాయి. తులసి ఆకులు జీర్ణసమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

పుచ్చకాయ రసం

పుచ్చకాయ రసంలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. అలాగే శరీరంలో నీటి కొరత రాకుండా చూస్తుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం కంటెంట్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ జ్యూస్ ను తాగడమే కాదు.. చక్కెరను తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉప్పు మోతాదుకు మించి తినకూడదు అప్పుడే మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

పుచ్చకాయ రసంలో పొటాషియం, మెగ్నీషియిం, విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాదు పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం నుంచి విషం బయటకు పోతుంది. మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ రసం తాగడం వల్ల వడదెబ్బకొట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఇది శరీరాన్ని బలంగా చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. 
 

క్యారెట్ జ్యూస్

క్యారెట్లలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, సోడియం, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ ఇ, పొటాషియం, విటమిన్ కె, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఒక్క క్యారెట్ జ్యూస్ తాగితే చాలు మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు లభిస్తాయి. 
 

క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు.. చర్మం ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ జ్యూస్ నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. గోళ్లు, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఈ జ్యూస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ను అడ్డుకుంటుంది. అంతేకాదు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రణలో ఉంచుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అలాగే జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. ముఖంపై ఉండే ముడతలను తగ్గించడానికి  సహాయపడుతుంది. 

click me!