చాలామంది ఇవి సుదూర ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షులు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాండ్ హెరాన్, కింగ్‌ఫిషర్, టైగర్ బిట్టర్న్ వంటి సుమారు 44 రకాల స్థానిక అటవీ పక్షులే ఈ ప్రమాదానికి గురవుతాయి. వీటిలో ఎక్కువ శాతం సరిగ్గా ఎగరడం తెలియని చిన్న పక్షులు ఉంటాయి.
గ్రామస్థులు ఏమంటున్నారంటే...
దశాబ్దాల క్రితం, రాత్రిపూట ఆకాశం నుంచి కిందపడుతున్న పక్షులను చూసి గ్రామస్తులు వాటిని 'దుష్టశక్తులు' లేదా ఆకాశం నుంచి వస్తున్న దెయ్యాలుగా భావించి కర్రలతో కొట్టి చంపేసేవారు. ఈ ఆచారమే జటింగా మిస్టరీని మరింత భయంకరంగా మార్చింది.
ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు, పక్షి శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల గ్రామస్తుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారు కిందపడిన పక్షులను చంపకుండా సురక్షిత ప్రాంతంలో ఉంచి, మరుసటి రోజు ఉదయం తిరిగి గాలిలోకి వదిలేస్తున్నారు. అలాగే ఆ నిర్దిష్ట నెలల్లో గ్రామాల్లో అనవసరంగా పెద్ద పెద్ద లైట్లు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి, ఈ పక్షులు నిజంగా పక్షుల ఆత్మహత్య ఏదీ లేదు..