AC Side Effects: ఎక్కువ గంటల పాటూ ఏసీ గదిలోనే ఉంటున్నారా? ఈ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే ఛాన్స్

Published : Sep 01, 2026, 05:11 PM IST

AC Side Effects: ఆఫీస్, ఇల్లు, కారు అని తేడా లేకుండా చాలామంది ఎక్కువ గంటల పాటూ ఏసీ గదుల్లోనే ఉంటున్నారు. ఇలా ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోండి.

PREV
13
ఏసీలో ఎక్కువ గంటలు ఉంటే ఏమవుతుంది?

రోజంతా ఏసీ గదిలో ఉండటం హాయిగా అనిపిస్తుంది, సౌకర్యంగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఏసీలో ఉంటే చర్మం పొడిబారడం, కళ్లలో మంట, ముక్కు-గొంతు పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు.

ఎక్కువసేపు ఏసీ గదిలో ఉంటే, గదిలోని తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. పెదాలు పగలడం, దురద వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో కళ్ల మంట, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆస్తమా లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి చల్లని, పొడి గాలి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల శ్వాస సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఊపిరితిత్తుల వైద్యులు చెబుతున్నారు.

23
ఈ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్
రోజంతా ఏసీ గదిలో ఉండేవారికి 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' (Sick Building Syndrome) అనే సమస్య వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని లక్షణాల వల్ల కొందరికి తలనొప్పి, నీరసం, ఏదైనా పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది కలగవచ్చు.
33
ఏసీ ఫిల్టర్ శుభ్రం చేయాలి
ఏసీ ఫిల్టర్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, దుమ్ము గాలిలో కలిసి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఏసీ వాడటం ఆరోగ్యానికి హానికరం అని చెప్పలేం. కానీ, శరీరానికి సరిపోయే ఉష్ణోగ్రత సెట్ చేసుకోవాలి. ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. శరీరానికి అవసరమైనన్ని నీళ్లు తాగాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి 10-15 నిమిషాలు బయటకు వెళ్లి రావడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి.
Read more Photos on
click me!

Recommended Stories