మునగాకు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు...
మొటిమలకు చెక్: మునగాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గించి, సున్నితమైన చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.
గ్లోయింగ్ స్కిన్ , కొల్లాజెన్: విటమిన్ సి, అమైనో ఆమ్లాలు చర్మానికి దృఢత్వాన్ని, యవ్వన కాంతిని ఇస్తాయి.
ఒత్తైన జుట్టు: ఇందులో ఉండే జింక్, ఐరన్ , ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలపరిచి, కురులు రాలడాన్ని అడ్డుకుంటాయి.
ఉసిరితో అందమైన ఛాయ సొంతం.. రక్త శుద్ధి, మెరుపు: ఉసిరి శరీరాన్ని లోపల నుండి డిటాక్సిఫై చేసి, చర్మానికి నేచురల్ రేడియంట్ గ్లోను ఇస్తుంది.
ముడతలు మాయం: కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం ముడతలు పడకుండా, యవనంగా మెరుస్తుంది. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు ఒత్తుగా, నల్లగా, షైనీగా మారుతుంది.
మునగాకు, ఉసిరి ఇలా కూడా తీసుకోవచ్చు... 3 టేబుల్ స్పూన్ల మునగాకు పొడి, 3 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల అల్లం పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, తేనె ఉంటే సరిపోతుంది. ముందుగా, వీటన్నింటినీ కలిపి ముద్దలా చేసి, చిన్న చిన్న మాత్రల సైజులో ఉండలు చేసుకోవాలి. వీటిని రెండు రోజులు నీడలో ఆరబెడితే అద్భుతమైన హోమ్‌మేడ్ మొరింగా టాబ్లెట్లు సిద్ధం.
దీనికి తోడు తగినన్ని నీళ్లు తాగుతూ, ప్రశాంతంగా నిద్రపోతే.. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండానే మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం.