Beach Trip Packing: ఈ దసరా హాలిడేస్ కు బీచ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కంగారులో ఇవి పెట్టడం మర్చిపోవద్దు

Published : Sep 30, 2026, 08:23 AM IST

Beach Trip Packing: వెకేషన్ కు వెళ్లేముందు కంగారులో థింగ్స్ మర్చిపోతుంటాం. ఇక బీచ్ లాంటి చోటకు వెళ్లినప్పుడు మాత్రం ఈ కంగారొద్దు. అసలేం పెట్టాలో తెలుసుకోవాలి. ప్యాకింగ్ కరెక్ట్ గా ఉంటే ట్రిప్ కంఫర్ట్ గా ఉంటుంది. మరి బ్యాగ్ లో ఏం పెట్టాలో చూద్దాం.

PREV
18
బీచ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కంగారొద్దు

ఎక్కడికైనా వెకేషన్ కు వెళ్లేముందు కంగారులో కొన్ని థింగ్స్ మర్చిపోతుంటాం. అసలైనవి, ఉపయోగపడేవే బ్యాగ్ లో పెట్టుకోం. అప్పుడు వెకేషన్ లో అటూ ఇటూ పరిగెత్తాలి. అందుకే ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇక బీచ్ లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఈ కంగారొద్దు. అసలేం పెట్టాలో తెలుసుకోవాలి. ప్యాకింగ్ కరెక్ట్ గా ఉంటే ట్రిప్ కంఫర్ట్ గా ఉంటుంది.

బీచ్ వెకేషన్ అనగానే సముద్రం, అలల చప్పుడు, చల్లటి గాలి, అందమైన సూర్యాస్తమయం మన కళ్ల ముందు మెదులుతాయి. మీరు గోవా, కేరళ లాంటి ఏ బీచ్ డెస్టినేషన్‌కు వెళ్తున్నా.. ప్యాకింగ్ కరెక్ట్‌గా ఉంటే ట్రిప్ చాలా ఈజీగా ఉంటుంది. బట్టలు, బ్రష్, ఛార్జర్ లాంటి వస్తువులతో పాటు బీచ్‌లో నిజంగా ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వస్తువులను బ్యాగ్‌లో పెట్టుకోవడం చాలా అవసరం.

28
వీటిని అస్సలు మిస్ చేయొద్దు

బీచ్‌కి వెళ్లేటప్పుడు ముందుగా గుర్తొచ్చేవి బీచ్‌వేర్, సన్‌స్క్రీన్. కానీ ప్రయాణంలో కొన్ని చిన్న వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయనే విషయం అక్కడికి వెళ్లాకే అర్థమవుతుంది. అందుకే ట్రిప్ మొదలుపెట్టే ముందే బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు ఈ వస్తువులను పెట్టుకోండి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అప్పటికప్పుడు సర్దాలంటే…మర్చిపోతాం.

38
జిప్ లాగ్ బ్యాగ్స్ ముఖ్యం.

సముద్రపు నీరు, ఇసుక వల్ల మొబైల్, డబ్బులు, తాళాలు, హెడ్‌ఫోన్స్ లాంటి చిన్న వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే రెండు మూడు జిప్‌లాక్ బ్యాగ్‌లను మీ వెంట తీసుకెళ్లడం మంచిది. తడిసిన వస్తువులను, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను విడిగా పెట్టుకోవడానికి ఇవి బాగా సహాయపడతాయి.

48
ట్రిప్ ఎంజాయ్ చేయలేరు

బీచ్‌లో ఇసుకపై నడవడానికి ఫ్లాట్ శాండిల్స్ లేదా ఫ్లిప్-ఫ్లాప్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. మీరు ఎక్కువసేపు వాకింగ్ చేయాలనుకుంటే సౌకర్యవంతమైన స్నీకర్స్ కూడా వెంట తీసుకెళ్లండి. కేవలం ఫ్యాషన్ కోసం ఇబ్బంది పెట్టే షూస్ వేసుకెళ్తే ట్రిప్ మజా మొత్తం పోతుంది. అవి కూడా నీళ్లలో తడిసి పాడవ్వొచ్చు.

58
అవసరమైనవి పట్టుకోవాలి

బీచ్ వెకేషన్‌కు వెళ్లేటప్పుడు పెద్ద బ్యాగ్ నింపేయడం కంటే, నిజంగా అవసరమైన వస్తువులను ఎంచుకుని స్మార్ట్‌గా ప్యాక్ చేసుకోవడం ముఖ్యం. ముందుగానే ప్యాకింగ్ చేసుకుంటే ట్రిప్‌లో చిన్న చిన్న సమస్యల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీ దృష్టి బ్యాగ్‌పై కాకుండా సముద్రపు అలలు, అందమైన సూర్యాస్తమయం, మధురమైన జ్ఞాపకాలపై ఉంటుంది.

68
వాటర్‌ప్రూఫ్ పౌచ్ తీసుకోండి

ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం వాటర్‌ప్రూఫ్ పౌచ్, చిన్న టవల్, మళ్లీ వాడుకునే వాటర్ బాటిల్, పవర్ బ్యాంక్, వ్యక్తిగత మందులు, అవసరమైన పర్సనల్ కేర్ వస్తువులను కూడా బ్యాగ్‌లో ప్యాక్ చేసుకోండి.

78
సన్‌స్క్రీన్ వాడండి

బీచ్ ట్రిప్‌లో సన్‌స్క్రీన్ అత్యంత ముఖ్యమైన వస్తువు. మీరు బయట ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి సూర్యుడి యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి మంచి సన్‌స్క్రీన్ వాడండి. స్విమ్మింగ్ చేశాక లేదా ఎక్కువగా చెమట పట్టిన తర్వాత మళ్లీ రాసుకోవాల్సి రావచ్చు. చర్మం పొడిబారినట్లు అనిపిస్తే అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్టైల్, సేఫ్టీ కోసం వెడల్పాటి టోపీ, మంచి క్వాలిటీ సన్‌గ్లాసెస్ పెట్టుకోండి.

88
కంఫర్టబుల్ బట్టలు తీసుకెళ్లండి

ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు కాటన్ లేదా లినెన్ లాంటి తేలికపాటి బట్టలు చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. లూజ్ షర్ట్స్, షార్ట్స్, లినెన్ ప్యాంట్స్, మ్యాక్సీ డ్రెస్సులు ప్యాక్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ లేదా వాటర్ యాక్టివిటీస్ చేసే ప్లాన్ ఉంటే దానికి తగ్గ స్విమ్‌వేర్ తీసుకెళ్లండి. తడిసిన బట్టలు మార్చుకోవడానికి అదనంగా ఒక జత బట్టలు పెట్టుకోవడం మర్చిపోకండి.

Read more Photos on
click me!

Recommended Stories