Passport: ప్రపంచంలో ఏ దేశానికీ ‘ పింక్ కలర్ పాస్ పోర్టు’ మాత్రం ఎందుకు ఉండదు..? అసలు కారణం ఇదే..!

Published : Sep 04, 2026, 04:23 PM IST

Passport: ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలి అంటే.. కచ్చితంగా పాస్ పోర్టు కావాలి. ఒక్కో దేశానికి ఒక్కో రంగు పోస్ పోర్టు ఉంటుంది. కానీ, ఏ దేశానికి పింక్ కలర్ పాస్ పోర్టు మాత్రం ఎందుకు ఉండదు?

PREV
13
Passport

విదేశాలకు వెళ్లాంటే కచ్చితంగా పాస్ పోర్ట్ ఉండాల్సిందే. కానీ, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల పాస్ పోర్టులు కేవలం నాలుగే నాలుగు రంగుల్లో ఉంటాయి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు. ఈ రంగులు మాత్రమే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగులు ఉన్నా.. ఈ నాలుగు రంగులే ఎందుకు ఎంచుకున్నారు? మరీ ముఖ్యంగా పింక్ రంగు పాస్ పోర్టు ఎందుకు లేదు? దీని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం...

23
అంతర్జాతీయ ప్రమాణాలు..

ప్రపంచంలో ఏ దేశమైనా పాస్‌పోర్ట్‌ల నమూనా, ఫార్మాట్‌ను ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) మార్గదర్శకాల ప్రకారమే తయారు చేయాలి. సెక్యూరిటీ చెకింగ్స్, ఎయిర్‌పోర్ట్ స్కానర్లలో పాస్‌పోర్ట్ రంగు స్పష్టంగా, అధికారికంగా కనిపించాలి. పింక్ వంటి బ్రైట్ కలర్స్ లేదా లైట్ షేడ్స్ అంతర్జాతీయంగా ప్రొఫెషనల్ లుక్‌ను ఇవ్వవు. అందుకే.. ఆ రంగులను పాస్ పోర్టు కవర్ గా సెలక్ట్ చేయరు.

33
ఈ నాలుగు రంగులనే ఎందుకు సెలక్ట్ చేశారు..?

పింక్ కలర్ ప్రొఫెషనల్ గా ఉండదు కాబట్టి.. దానిని సెలక్ట్ చేయలేదు సరే.. మరి, రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ మాత్రం ఎందుకు సెలక్ట్ చేశారు అనే దానికి కూడా కారణాలు ఉన్నాయి.

ఎరుపు (Red): కమ్యూనిజం చరిత్ర ఉన్న దేశాలు (చైనా, రష్యా) లేదా ఈయూ (EU) సభ్య దేశాలు వాడతాయి.

నీలం (Blue): 'న్యూ వరల్డ్' దేశాలు (అమెరికా, కెనడా, భారతదేశం సాధారణ పౌరులు) వాడతాయి.

ఆకుపచ్చ (Green): ఇస్లామిక్ సాంప్రదాయం, ప్రాముఖ్యత ఉన్న దేశాలు (పాకిస్తాన్, సౌదీ అరేబియా) వాడతాయి.

నలుపు (Black): న్యూజిలాండ్ (వారి జాతీయ రంగు) లేదా మురికి త్వరగా కనిపించకుండా ఉండేందుకు కొన్ని ఆఫ్రికన్ దేశాలు వాడతాయి.

పింక్ రంగుకు.. ఇటువంటి భౌగోళిక లేదా రాజకీయ ప్రాముఖ్యత అంతర్జాతీయ స్థాయిలో లేదు. అందుకే ఈ రంగును ఎంచుకోలేదు. అంతేకాదు..పాస్‌పోర్ట్ అనేది ఐదేళ్ల నుండి పదేళ్ల వరకు నిరంతరం వాడే అధికారిక పత్రం. పింక్ వంటి తేలికపాటి రంగు పాస్‌పోర్ట్‌లు ప్రయాణాల్లో చేతి మురికి, నూనె జిడ్డు, లేదా ప్రయాణ రాపిడి వల్ల త్వరగా పాడైపోతాయి. అందుకే మురికి, గీతలు పడినా కనిపించకుండా ఉండటానికి అధికారిక సంస్థలు ఎల్లప్పుడూ ముదురు రంగులకే ప్రాధాన్యత ఇస్తాయి.

పాస్‌పోర్ట్ కవర్‌ను కేవలం సాధారణ కాగితంతో కాకుండా ప్రత్యేకమైన డ్యూరబుల్ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. పాస్‌పోర్ట్ కవర్లపై వాడే రంగు డెసిగ్నేషన్స్ , పాలిమర్స్ ప్రామాణికంగా లభించాలి. డార్క్ పిగ్మెంట్స్ ప్రొడక్షన్ చాలా సులభం, చౌక కూడా... అందుకే.. ఈ రంగులను ఎంచుకుంటారు.

పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి జాతీయతను, భద్రతను సూచించే అత్యున్నత అధికారిక పత్రం. అందుకే ఫ్యాషన్ లేదా ట్రెండ్స్ కంటే ప్రొఫెషనలిజం, భద్రత, మన్నికకే ప్రపంచ దేశాలు ప్రాధాన్యత ఇస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories