ఎలాంటి యాడ్స్ లేకపోయినా డీమార్ట్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం 'వర్డ్ ఆఫ్ మౌత్' పబ్లిసిటీ. డీమార్ట్‌లో తక్కువ ధరకు సామాను కొనుగోలు చేసిన ఒక కస్టమర్, మరో నలుగురికి ఆ విషయాన్ని చెప్పారు. ఇలా ప్రతీ వినియోగదారుడే డీమార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. కేవలం కస్టమర్ల సంతృప్తి , నమ్మకమే ఈ బ్రాండ్‌ను టాప్ స్థాయికి చేర్చింది.
ఎవ్రీడే లో ప్రైసెస్ (EDLP) వ్యూహం
డీమార్ట్ అనుసరించే మరో పెద్ద రహస్యం 'ఎవ్రీడే లో ప్రైసెస్' (EDLP) మోడల్. పండుగలు, ప్రత్యేక రోజులు అని కాకుండా ఏడాది పొడవునా అన్ని వస్తువులపై కనీస డిస్కౌంట్లు లభిస్తాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం డీమార్ట్‌ను తమ మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటారు.
ఖర్చులను తగ్గించడం..
లాభాలను పెంచుకోవడం డీమార్ట్ తన స్టోర్ల నిర్వహణలో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలంకరణల మీద ఎక్కువ ఖర్చు చేయకుండా, గోడలు, ఫ్లోరింగ్ చాలా సాదాసీదాగా ఉండేలా చూసుకుంటారు. అలాగే సరఫరాదారులకు నగదును వీలైనంత త్వరగా చెల్లించడం ద్వారా వారి నుంచి అత్యంత తక్కువ ధరకు సరుకులను పొందుతారు. ఈ చిన్న చిన్న వ్యాపార సూత్రాలే డీమార్ట్‌ను తిరుగులేని శక్తిగా మార్చాయి.