Mother in law Psychology: కోడళ్లను వేధించే అత్తల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?

Published : Jan 01, 2026, 06:50 PM IST

పెళ్లైన మహిళ జీవితంలో అత్త పాత్ర కీలకమైనది. అత్తా కోడళ్ల బంధం.. ప్రేమ, పరస్పర గౌరవంతో ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. కానీ అదే బంధంలో తేడాలు ఉంటే ఆ ఇల్లు నరకంతో సమానం. మరి కోడళ్లను వేధించే అత్తల మనస్తత్వం గురించి సైకాలజీ ఏం చెప్తోందో చూద్దాం. 

PREV
15
కోడళ్లను వేధించే అత్తల మనస్తత్వం

మన సమాజంలో కోడళ్లను వేధించే అత్తలు చాలామందే ఉంటారు. సైకాలజీ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇలాంటి ప్రవర్తన అనేక మానసిక, సామాజిక అంశాల కలయిక వల్ల ఏర్పడుతుంది. అత్త గతంలో ఎదుర్కొన్న అనుభవాలు, ఆమె పెరిగిన వాతావరణం, కుటుంబంలో ఆమెకు లభించిన గౌరవం లేదా అవమానాల వంటివి ఆమె ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి.

25
ఇన్ సెక్యూర్ ఫీలింగ్

సైకాలజీ నిపుణుల ప్రకారం అత్తలు ఇలా ప్రవర్తించడానికి మొదటి కారణం.. అధికారాన్ని కోల్పోతున్నామనే భావన. పెళ్లికి ముందు ఇంట్లో అన్నింటిపై నియంత్రణ ఉన్న మహిళ, కొడుకు పెళ్లయ్యాక ఆ స్థానం కోడలికి మారుతుందన్న భావన ఆమెకు ఇన్ సెక్యూర్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ భావన భయంగా మారి, ఆ భయమే కోడలిపై ఆధిపత్యం చూపించాలనే ప్రయత్నంగా బయటపడుతుంది. 

35
కోడలితో పోల్చుకోవడం

సైకాలజీ ప్రకారం, కొంతమంది అత్తలు తమ యవ్వనం, తమ జీవితాన్ని కోడలితో పోల్చుకుంటారు. కోడలికి లభిస్తున్న స్వేచ్ఛ, ప్రేమ, శ్రద్ధ తనకు అప్పట్లో లభించలేదన్న భావన అసూయగా మారుతుంది. ఈ అసూయను నేరుగా ఒప్పుకోలేక, ఆమె కోడలిని తప్పుపట్టడం, చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా చూపించడం మొదలుపెడుతుంది. ఇది ఆమె లోపలి అసంతృప్తికి ఒక ప్రతిబింబం మాత్రమే.

45
పెరిగిన వాతావరణం

అత్త పెరిగిన కాలం, విలువలు, నియమాలు వేరు. కోడలు పెరిగిన వాతావరణం వేరు. ఈ తేడాను అర్థం చేసుకునే సహనం లేకపోతే, కోడలి ప్రవర్తన అత్తకు కాస్త తేడాగా,  అహంకారంగా అనిపిస్తుంది. సైకాలజీ ప్రకారం మార్పును అంగీకరించలేని వ్యక్తులు ఎక్కువగా నియంత్రణాత్మకంగా మారుతారు. ఈ నియంత్రణ ప్రయత్నమే వేధింపుల రూపంలో బయటపడుతుంది.

కొంతమంది అత్తలలో కొన్ని భావోద్వేగ గాయాలు కూడా ఉండొచ్చు. తమ అత్తల చేతిలో తాము గతంలో అనుభవించిన బాధలను అవగాహన లేకుండా ఇప్పుడు కోడలిపై చూపిస్తుంటారు. "నేను అనుభవించాను కాబట్టి నువ్వూ అనుభవించాలి” అనే ఆలోచన వారికి తెలియకుండానే వారిపై బలంగా పనిచేస్తుంది.

55
కంట్రోల్ చేయడం ద్వారా..

అంతేకాదు కుటుంబంలో భావోద్వేగ వ్యక్తీకరణ లేకపోవడం కూడా ఒక సమస్యే. ప్రేమను, ఆప్యాయతను నేరుగా చూపించడం తెలియని అత్తలు, తమ ఆందోళనను ఆదేశాలుగా, విమర్శలుగా వ్యక్తపరుస్తారు. భావాలను మంచిగా వ్యక్తపరచలేని వ్యక్తి, ఇతరులను నియంత్రించడం ద్వారా తన లోపాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తారు. 

అయితే, ప్రతి అత్త ఇలా ఉంటుందనుకోవడం తప్పు. సమస్యాత్మక ప్రవర్తన వెనుక ఉన్న మానసిక కారణాలను అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధ్యమవుతుంది. నిపుణుల సూచనల ప్రకారం, పరస్పర సంభాషణ, సరిహద్దులు స్పష్టంగా పెట్టుకోవడం, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం వంటి చర్యలు పరిస్థితిని మెరుగుపరుస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories