Roti Maker: ముఖేష్ అంబానీ ఇంట్లో రోటీలు చేసే చెఫ్ జీతం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడతారు. ఐఏఎస్ ఉద్యోగికి వచ్చే జీతం కన్నా ఈ రోటీలు చేసే వ్యక్తే ఎక్కువ సంపాదిస్తాడు. అంబానీల ఇంట్లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుటుంబం ఎంతో విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్లు పూర్తి శాకాహారులు. ఎక్కువగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తింటారు. ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ అంబానీ తనకు ఇంట్లో చేసిన పప్పు, రోటీ, అన్నం ఇష్టంగా తింటానని చెప్పారు. అలాగే థాయ్ వంటకాలను కూడా ఇష్టంగా తింటారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం ఇడ్లీ సాంబార్ తినేందుకు ఇష్టపడతానని ఆయన ఎన్నో సార్లు చెప్పారు.
24
రోటీలు చేసే వారి జీతం
అంబానీల ఇంట్లో ప్రతిరోజూ 4000 రోటీలు తయారుచేస్తారు. ఇక్కడ రోటీలు చేసేవారికి నెలకు రెండు లక్షల రూపాయల జీతం. ఇది వినగానే చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ ఇదే నిజం. ఇది గతేడాది జీతం, ఈ ఏడాది ఇంకా పెరిగి ఉండొచ్చు. ఒక చపాతీలు చేసే వ్యక్తికి అంత జీతం ఎందుకు అనకుంటారు కూడా. కానీ ఈ ఉద్యోగం అంత సులువుగా రాదు. ఇక్కడ పని చేయాలంటే హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉండాలి. రోటీలు తయారుచేసే వారికి కూడా నెలకు రూ. 2 లక్షల జీతం, అంటే ఏడాదికి రూ. 24 లక్షలు. 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, విలాసవంతమైన సౌకర్యాలున్న అంబానీ ఇంట్లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ అక్కడ ప్రతిరోజూ ఉచిత భోజనం ఉంటుంది. అందరికీ వంట చేయడానికి ప్రత్యేక చెఫ్ బృందం ఉంది. అంటే ప్రతిరోజూ ఓ ఫంక్షన్‌కు ఎంతమంది వస్తారో అంతమందికి రోజూ ఇక్కడ వంట చేయాలి. మరి ఆ మాత్రం జీతం తీసుకుంటారు కదా.
34
ఒక ఫ్లోర్లోనే వంటిల్లు
సిబ్బంది అందరి కోసం ఆహారాన్ని తయారుచేసేందుకు వంటగదిగా ఒక ఫోర్ నే ఇచ్చారు. అంబానీ తన సిబ్బంది కోసం ఒక ఫ్లోర్‌నే కేటాయించారు. అందరూ అదే ఫ్లోర్లో పండుగలా భోజనం చేస్తారు. 27 అంతస్తుల ఈ ఇంటి విలువ సుమారు రూ. 15 వేల కోట్లు. ఈ 4,000 రోటీలను సిబ్బందికి, అతిథులకు సమానంగా పంపిణీ చేస్తారు. అందుకే రోటీలు చేసేవారికి అంత జీతం ఇస్తారు.
ఈ రోటీలు కేవలం ఉదయం అల్పాహారం కోసం మాత్రమే కాదు. 600 మంది సిబ్బందితో పాటు వచ్చే అతిథులకు కూడా ఇదే ఆహారం అందిస్తారు. అంబానీ కుటుంబం, సిబ్బంది కోసం వంట చేయడానికి ఓ పెద్ద వంట బృందం ఉంది. రోటీలు చేసే చెఫ్ ఈ విభాగానికి హెడ్ ఉంటారు. మిగిలిన సిబ్బంది ఈ చెఫ్ కింద పనిచేస్తారు. ఈ హెడ్ చెఫ్‌కు రూ. 2 లక్షల జీతం. అతని కింద పనిచేసే సిబ్బందికి కూడా వారి అనుభవం, బాధ్యతలను బట్టి జీతాలు ఉంటాయి. అయితే, వాళ్లేమీ మనలా చేతులతో రోటీలు చేయరు. అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే రోటీ మేకింగ్ మెషిన్లు ఉన్నాయి. వాటి సాయంతో రోటీలు తయారుచేస్తారు.