సాధారణంగా ఇంటి ముందు ముగ్గు పెట్టడం అంటే..ప్రతిరోజూ ఉదయం ఆధ్యాత్మికంగా లక్ష్మీ దేవిని ఇంట్లో కి ఆహ్వానించడం అని అర్థం. ఈ పద్దతిని మనమంతా యుగయుగాలుగా ఫాలో అవుతూ వస్తున్నారు. ముగ్గు వేయడం పూజలకు చాలా ముఖ్యం. ఇక, పూజలు, పండగలతో సంబంధం లేకుండా.. ప్రతిరోజూ ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇంటికి శుభం జరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కూడా ఉదయాన్నే లేచి వేయడం వల్ల.. మనం చాలా చురుకుగా ఉండటానికి సహాయపడుతుందట.