మన జీవితంలో మనం చాలా మంచి పనులు, చెడ్డ పనులు చేసి ఉంటాం. వాటికి భూమి మీద ఉన్నప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవించినా, అనుభవించకున్నా.. మరణానంతరం మాత్రం వాటికి తగిన శిక్షలు కచ్చితంగా ఉంటాయి. అలా మనం చేసే పనులకు విధించే శిక్షలను వివరంగా చెప్పేదే గరుడ పురాణం.
హిందూమతంలోని 18 మహా పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో మనిషి జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జనమ్మ, అధోకరణం మొదలైన వాటిన్నంటినీ వివరంగా వివరించారు.