ఇవి పరగడుపున మాత్రమే తినాలి..? ఎందుకో తెలుసా?

First Published | Dec 17, 2024, 12:04 PM IST

అలా అని పరగడుపున ఏ ఆహారాలు పడితే అవి తినకూడదు. ఎందుకంటే.. మనం తీసుకునే ఆహారాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే.. పరగడుపున ఎలాంటి ఆహారాలు తినాలో చూద్దాం…
 

Eating Food

ఉదయం పూట మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం కనుక ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం మొదలుపెడితే.. అనారోగ్య సమస్యలు రావడం కూడా మొదలౌతాయి.  అందుకే అల్పాహారం మానేయకూడదు. ఆలస్యం కూడా చేయకూడదు. ఒకవేళ ఆలస్యం అవుతోంది అనుకుంటే మాత్రం మన ఆకలిని తీర్చుకోవడానికి పరగడుపున కొన్ని ఆహారాలను తీసుకోవాలి.
 

Breakfast

అలా అని పరగడుపున ఏ ఆహారాలు పడితే అవి తినకూడదు. ఎందుకంటే.. మనం తీసుకునే ఆహారాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే.. పరగడుపున ఎలాంటి ఆహారాలు తినాలో చూద్దాం…

ఖాళీ కడుపుతో తినదగిన ఆహారాలు:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినగలిగే ఆహారాలు జీవక్రియ, గట్ ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
 

Tap to resize


పెరుగు:
ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగు శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని కూడా అందేలా చేస్తుంది.
 

papaya

బొప్పాయి:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బొప్పాయి పండ్లను తినడం వల్ల అందులో ఉండే పోషకాలు పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.


కూరగాయల సూప్:
చాలా మంది అల్పాహారం తీసుకునే ముందు పండ్ల రసాలను తమ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. దీన్ని తరచుగా తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. అందుకే పచ్చికూరగాయలు, క్యారెట్, బీట్‌రూట్, పుదీనా, కొత్తిమీర తదితరాలను జ్యూస్‌గా చేసుకుని ఉదయాన్నే తాగడం మంచిది. ఇది రోజంతా శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.
 

Almonds for Weight Loss

నానబెట్టిన బాదం:
ఖాళీ కడుపుతో తినదగిన ఆహారాల జాబితాలో నానబెట్టిన బాదం కూడా చేర్చబడుతుంది. 10 లేదా 15 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం తినండి. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
 

banana


అరటిపండు:

అరటిపండ్లను ఖాళీ కడుపుతో తింటే రాత్రిపూట తినే ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇందులోని పోషకాలు జీవక్రియలను క్రమబద్ధీకరించి, మలబద్ధకం సమస్యలను పరిష్కరిస్తాయి. అదనంగా, తేనె, గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు మొదలైనవి తాగడం మంచిది, ఇది రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది.
 

Latest Videos

click me!