ఇవి మాత్రం ఫ్రిజ్ కి పెట్టకూడదు..
1.ఎక్కువ బరువు ఉన్న మ్యాగ్నెట్స్..
చాలా మది చాలా పెద్దవి లేదంటే బరువైన మ్యాగ్నెట్స్ ఎక్కువ సంఖ్యలో ఫ్రిజ్ కి పెడుతూ ఉంటారు. ఇలాంటివి మాత్రం పెట్టకూడదు. దీని వల్ల ఫ్రిజ్ పై అదనపు భారం పడుతుంది. ఇది వెంటనే ప్రభావం చూపించకపోయినా.. కొన్నాళ్లకు.. ఫ్రిజ్ డోర్ లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. బరువైనవి మాత్రమే కాదు, ఎక్కువగా కూడా పెట్టకూడదు.
2. డోర్ రబ్బర్ సీల్ కి అడ్డుగా ఉండకూడదు...
మాగ్నెట్ లేదా దానితో పెట్టిన కాగితం రబ్బర్ సీల్ మధ్యలో ఇరుక్కుపోతే, డోర్ పూర్తిగా మూసుకోకపోవచ్చు. దీంతో చల్లని గాలి బయటకు వెళ్లి, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
3. స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రిజ్‌లపై
ప్రతి స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రిజ్‌పై మాగ్నెట్లు అంటుకోవు. కొన్ని మోడళ్లలో నాన్-మ్యాగ్నెటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగిస్తారు. అలాంటి ఫ్రిజ్‌లపై మాగ్నెట్లు పనిచేయవు.
ఎప్పుడు జాగ్రత్తపడాలి?
పరిశ్రమల్లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలు (Industrial Magnets) ఫ్రిజ్‌కు దగ్గరగా ఉంచకపోవడం మంచిది. స్మార్ట్ ఫ్రిజ్‌ల టచ్ డిస్‌ప్లే లేదా కంట్రోల్ ప్యానెల్‌పై మాగ్నెట్లు అంటించకండి.డోర్ సీల్‌కు అడ్డుగా మాగ్నెట్లు లేదా కాగితాలు పెట్టవద్దు.
అయితే ఫ్రిజ్‌పై మ్యాగ్నెట్లు వాడొచ్చా..?
ఎలాంటి సమస్యలు లేకుండా మీరు ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ వాడొచ్చు. సాధారణ అలంకరణ కోసం ఉపయోగించే చిన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తో ఎలాంటి నష్టం ఉండదు. అవి ఫ్రిజ్ పనితీరు, కూలింగ్ లేదా కంప్రెసర్‌పై ప్రభావం చూపవు. అయితే, బరువైన మాగ్నెట్లు ఎక్కువగా పెట్టడం, డోర్ సీల్‌కు అడ్డుగా వస్తువులు ఇరుక్కునేలా ఉంచడం మాత్రం మంచిది కాదు.