Neelakurinji:12ఏళ్లకు ఒకసారి మాత్రమే పూసే అందమైన పూలు..మన దేశంలో ఇవి ఎక్కడ కనిపిస్తాయి?

Published : Oct 22, 2026, 11:07 AM IST

Neelakurinji: 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లు....ఈ పూలు కూడా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. వీటిని చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. అలాంటి అందమైన పూలు ఎక్కడ పూస్తాయో తెలుసా?

PREV
13
ఈ అద్బుతాన్ని ఎప్పుడైనా చూశారా?

మన ప్రకృతి ఎన్నో అద్భుతాలకు నిలయం. అందులో కొన్ని అరుదైన విషయాలు చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. అలాంటి అద్భుతాల్లో నీలకురింజి పూలు కూడా ఒకటి. మన దేశంలో కూడా పూసే ఈ పూలు చూడాలంటే 12 సంవత్సరాలు ఆగాల్సిందే. కేవలం, మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకునే ఈ పూలల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా?

23
నీలకురింజి పూల ప్రత్యేకత...

ఈ పూల శాస్త్రీయ నామం స్టోబిలాంతెస కుంతియానా. ఈ మొక్కలు చాలా భిన్నంగా ఉంటాయి. మన చుట్టూ చాలా పూల మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలు సంవత్సరమంతా పూలు పూస్తే, కొన్ని సీజన్ లో మాత్రమే పూస్తాయి. అయితే, ఈ నీలకురింజి పూలు 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయి. ఇవి పూసినప్పుడు.. ఆ ప్రాంతమంతా బ్లూ, పర్పుల్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తాయి. నేల మీద ఈ రెండు రంగులు పరిచినట్లు అందంగా, అద్భుతంగా కనపడుతుంది.

తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని ప్రసిద్ధ 'నీలగిరి' (Blue Mountains) కొండలకు ఆ పేరు రావడానికి ఈ నీలకురింజి పువ్వులే ప్రధాన కారణం. ఇవి పూసినప్పుడు కొండలన్నీ నీలి రంగులోకి మారడంతో ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇవి ఏకవార్షిక మొక్కల జాతికి చెందినవి కాకపోయినా, తమ జీవితకాలంలో ఒక్కసారే పూస్తాయి. పూలు పూసి, విత్తనాలు రాలిన తర్వాత ఆ మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. మళ్లీ ఆ విత్తనాల నుంచే కొత్త మొక్కలు పుట్టి, సరిగ్గా పన్నెండేళ్ల తర్వాత పూలు పూస్తాయి. అందుకే, ఈ పూలను చూడటానికి పర్యాటకులు క్యూలు కడుతూ ఉంటారు.

గిరిజనుల నమ్మకం..

పశ్చిమ కనుమల అటవీ ప్రాంతంలో నివసించే 'ముతువాన్' వంటి స్థానిక గిరిజనులు తమ వయస్సును లెక్కించడానికి ఈ నీలకురింజి పూలు పూసే సైకిల్ ని ప్రామాణికంగా వాడుకోవడం విశేషం. ఒకసారి నీలకురింజి పూసి కనుమరుగై మళ్లీ పూస్తే వారికి పన్నెండేళ్లు నిండినట్లు అని వారు లెక్కించుకుంటారు.

33
నీలకురింజిలో ఔషధ గుణాలు..

ఈ అరుదైన పూలు కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా, పర్యావరణపరంగా,ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి:

పర్యాటక రంగానికి జీవం: కేరళలోని మూన్నార్ , తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతాలలో ఈ పూలు పూసే కాలంలో ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుంది.

అరుదైన కురింజి తేనె: ఈ పువ్వుల మకరందం నుండి తేనెటీగలు సేకరించే తేనె ఎంతో ప్రత్యేకమైనది. ఇది అద్భుతమైన రుచితో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

సాంప్రదాయ వైద్యం: ఆయుర్వేదం, స్థానిక గిరిజన వైద్యంలో నీలకురింజి మొక్క వేర్లు, ఆకులను ఉపయోగిస్తారు. వీటిని వాడటం వల్ల కీళ్ల నొప్పులు వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు సాంప్రదాయ వైద్యులు దీనిని వాడుతుంటారు. చర్మ సంరక్షణకు కూడా ఇవి సహాయపడతాయి. ఈ పూలు ఈ ఏడాది.. కేరళలో ఇప్పుడు విరబూశాయి. వీటిని చూడాలి అనుకుంటే.. ఇదే కరెక్ట్ టైమ్. ఇప్పుడు మిస్ అయితే.. మళ్లీ 12 ఏళ్లు ఆగాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories