రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మంచి ఫేస్ వాష్ లేదా శుభ్రమైన నీటితో కడుక్కుని తుడవండి. ముఖం ఆరిన తర్వాత, ఈ సీరమ్‌ను స్ప్రే బాటిల్ సహాయంతో ముఖంపై స్ప్రే చేయాలి. ఆ తర్వాత వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. వేళ్లతో ముఖం అంతటా 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి, తద్వారా సీరమ్ చర్మంలోకి బాగా ఇంకుతుంది. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయాన్నే సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఈ సీరమ్ రాయడం వల్ల కలిగే లాభాలు..
బంగాళదుంపలోని బ్లీచింగ్ గుణాలు నల్లమచ్చలు, పిగ్మంటేషన్, డార్క్ సర్కిల్స్‌ను వేగంగా తగ్గిస్తాయి. దీని వల్ల ముఖం ఈవెన్ గా కనపడుతుంది. ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనపడుతుంది. అంతేకాదు.. ఈ సీరమ్ ని ప్రతిరోజూ రాత్రిపూట రాయడం వల్ల దానిలో ఉండే విటమిన్ ఇ, రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. రెగ్యులర్ గా రాయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.