ఆపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గిస్తుంది.. ఎలా ఉపయోగించాలంటే..!

Published : Sep 01, 2022, 04:58 PM IST

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి  ఇందుకోసం దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.. 

PREV
18
 ఆపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గిస్తుంది.. ఎలా ఉపయోగించాలంటే..!

ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి తెలియని వారుండరు. దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు, చర్మానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుది. దీనిలో ఎన్నో ఔషదగుణాలు  ఉన్నాయి. అందులోనూ దీన్ని ఉపయోగించి సులువుగా బరువు కూడా తగ్గొచ్చు కూడా. కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. 
 

28

సూపర్ మార్కెట్లలో ఆపిల్ సైడర్ వెనిగర్ సులువుగా దొరుకుతుంది. అయితే దీని ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం దీన్ని మార్నింగ్ యే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ను చాలా పల్చగా చేయాలి. అలాగే తీసుకుంటే మాత్రం ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కలిపి తీసుకోండి. ఆపిల్ సైడర్ వెనిగర్ మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పదండి.

38

మంచి బ్యాక్టీరియా పెరుగుదల

మన ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియాను ఆపిల్ సైడర్ వెనిగర్ విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. 
 

48

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంతో సహాయపడుతుంది. అయితే ఇది రక్తంలో పెరిగిన చక్కెరను మాత్రం నియంత్రణలో ఉంచదు. 
 

58

బరువు తగ్గేందుకు సహాయపడుతుంది

ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్న విషయాన్ని చాలా మంది వినే ఉంటారు. వాస్తవానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీరు అతిగా తినలేరు. ఎందుకంటే ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇది మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

68

చర్మవ్యాధులతో పోరాడుతుంది

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని  కాంతివంతంగా చేయడంతో పాటుగా.. కొన్ని రకాల చర్మ వ్యాధులతో కూడా పోరాడటానికి హాయపడుతుంది.
 

78

దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఇపిల్ సైడర్ వెనిగర్ దంతాలను ఆరోగ్యంగా మెరిపించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని మౌత్ వాష్ గా కూడా  ఉపయోగించేవారున్నారు. దీనిలో చెడు బ్యాక్టీరియాతో సైతం పోరాడే లక్షణాలున్నాయి. 
 

88

మొటిమలను తగ్గిస్తుంది

ఆపిల్ సైడర్ వెనిగర్ మొటిమలకు తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా కూడా చేస్తుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories