టేస్టీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?

First Published Nov 8, 2021, 7:50 PM IST

వర్షాకాలంలో, చలికాలంలో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం వేళ ఒక టీ తో పాటు ఒక మంచి స్నాక్స్ (Snacks) తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు స్వీట్ కార్న్ తో వడలు చేసుకుని తినండి చల్లటి సాయంత్రపు వేళని ఆస్వాదించండి. ఈ ఆర్టికల్ (Article) ద్వారా స్వీట్ కార్న్ వడలు ఎంతో సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

స్వీట్ కార్న్ ఆరోగ్యానికి (Health) మంచిది. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఎప్పుడు మనం రొటీన్ గా చేసుకునే బజ్జీలు, పునుగులు, పకోడీలు కాకుండా ఇలా స్వీట్ కార్న్ తో వడలు చేసి మీ పిల్లలకు పెట్టండి వారికి ఎంతగానో ఈ స్నాక్ ఐటం నచ్చుతుంది. స్వీట్ కార్న్ సంవత్సరం పొడవునా మనకు మార్కెట్ (Market) లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఎంతో తేలికైన స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు : ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు (Sweet corn), రెండు పచ్చిమిరపకాయలు (Green chilli), కొంచెం అల్లం (Ginger), నూనె (Oil), కొత్తిమీర తరుగు (Coriyander), పుదీనా (Mint), జీలకర్ర (Cumin seeds) తగినంత ఉప్పు (Salt), ఒక ఉల్లిపాయ (Onion), సగం క్యాప్సికం (Capsicum), కావలసినంత కారం (Red chilli powder), కొంచెం గరం మసాలా (Garam masala), కొంచెం చాట్ మసాలా (Chat masala), రెండు టేబుల్ స్పూన్ ల శనగపిండి (Gram flour), పావు కప్పు బియ్యపు పిండి (Rice flour), టమోటా సాస్ (Tomato sauce).

ముందుగా మిక్సీలో అల్లం, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో స్వీట్ కార్న్ గింజలు వేసి బరకగా మిక్సి పట్టాలి. ఇలా మొత్తం స్వీట్ కార్న్ గింజలను బరకగా మిక్సి పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి (Bowl) తీసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, క్యాప్సికం లను సన్నగా తరిగి స్వీట్ కార్న్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి (Mix well). తర్వాత ఇందులో మీకు కావలసినంత కారం తగినంత ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా, రెండు టేబుల్ స్పూన్ ల శనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి.
 

స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇలా వేడెక్కిన నూనెలో స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వడలుగా ఒత్తుకుని నూనెలో వేయాలి.  తక్కువ మంట (Low flame) మీద వదలను ఢీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వడలు బాగా ఫ్రై అవుతాయి. ఎక్కువ మంట మీద ఢీ ఫ్రై చేస్తే త్వరగా కలర్ వచ్చి లోపల పచ్చగా ఉంటుంది. తక్కువ మంట మీద ఢీ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చాక వడలను తియ్యాలి. వీటిని ఒక ప్లేట్ లో పెట్టి టమోటా సాస్ తో సర్వ్ చేయండి. అంతే ఎంతో సింపుల్ గా చేసుకునే స్వీట్ కార్న్ వడలు రెడీ (Ready).
 

click me!