ఆడవాళ్ళ షాపింగ్ అంటే భయమేస్తోందా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

First Published Nov 8, 2021, 7:04 PM IST

పండుగలు (Festivals) వస్తున్నాయంటే చాలు ఆడవాళ్ళు నెలరోజుల ముందు నుంచే షాపింగ్ ప్లాన్ చేస్తారు. షాపింగ్ చేయడం తప్పు కాదు. అందుకోసం అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయరాదు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా షాపింగ్ చేసే ప్రతి మహిళ తెలుసుకోవలసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆడవారి షాపింగ్ అంటే మగవారి గుండెల్లో దడ మొదలవుతుంది. వారితో షాపింగ్ (Shopping) వెళ్లడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వారు ఒకే షాప్ లో షాపింగ్ చేస్తే పర్లేదు కానీ ఆడవారికి సహనం (Patience) ఎక్కువ కదండీ.. వారికి అన్ని షాపులు తిరగందే మనస్పూర్తిగా ఉండదు. ఆడవారి షాపింగ్ కి మగవారి జేబులు ఖాళీ అవుతాయని భయంతో వారు ఆడవారితో షాపింగ్ వెళ్ళడానికి ఆలోచిస్తారు.

అందుకే  షాపింగ్ చేసే ప్రతి మహిళ  మీ మగవారిని కాస్త గుర్తు చేసుకొని షాపింగ్ చేయడం మంచిది. షాపింగ్ కి ముందు కాస్త ప్లాన్ (Plan) చేసుకొని షాపింగ్ చేయడం మంచిది. ఎప్పుడు షాపింగ్ చేసిన మన బడ్జెట్ (Budget) ను తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫంక్షన్ లు, పార్టీలు, పండుగలు ఉంటే అందరిలోనూ మనం ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నాం. ఇది తప్పేం కాదులేండి.

అలా ప్రత్యేకంగా కనిపించాలని మనము షాపింగ్ కోసం అనవసరపు ఖర్చులు చేయరాదు. పండుగలు ఉన్నాయంటే కాస్త ముందుగానే మనము షాపింగ్ ప్రారంభించాలి. పండగ సీజన్ 
(Festive season) లో షాపింగ్ చేయడంతో ఆ బిజీ టైంలో మార్కెట్ (Market) లో అన్ని వస్తువులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దాంతో మన బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకే కాస్త ముందుగానే మీరు షాపింగ్ చేసుకోవడంతో మీ బడ్జెట్, మీ షాపింగ్ సమయం తగ్గుతుంది.

ఇప్పుడు ప్రతి పండుగకు, పార్టీలకు (Party), ఫంక్షన్ లకు (Functions) ఒక అవుట్ ఫిట్ డ్రెస్ అంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రత్యేకంగా కనిపించేందుకు కాస్త తక్కువ బడ్జెట్ లో షాపింగ్ చేసుకోవడం మంచిది. పండుగ సీజన్ లో మార్కెట్ లో ఆఫర్స్ ఉంటాయి. అలాంటి షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం మంచిది. మీరు ముందుగానే షాపింగ్ కి ఎంత  బడ్జెట్ లో ఖర్చు పెట్టాలి అనుకున్నది ప్లాన్ చేసుకోవాలి. షాపింగ్ చేసేటప్పుడు ఆ బడ్జెట్ పెరగకుండా చూసుకోవాలి.

అనవసరమైన వస్తువులను కొనకండి. మీకు అవసరమయ్యే వస్తువులను మాత్రమే కొనుగోలు చేసుకోండి. పండుగ సీజన్స్ కి మార్కెట్లో ఆఫర్ (Offers) లు పెడుతూ ఉంటారు. అప్పుడు షాపింగ్ చేసుకోండి. మన అలంకరణకు సరిపడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ  కోసం అదనపు ఖర్చు చేయకండి. ఆర్టిఫిషియల్ జువెలరీ కి ఎంత ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చుతో చిన్న వస్తువు అయినా బంగారపు వస్తువులను కొనుగోలు చేసుకోండి.
ఇది మీకు జీవితాంతం (Lifelong) ఉపయోగపడుతుంది.

పండగ సీజన్ లలో ఎగ్జిబిషన్స్ (Exhibition) నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో తక్కువ ధరలకే దానికి కావలసిన వస్తువులు దొరుకుతూ ఉంటాయి. వాటిని కొనుగోలు చేసుకోండి మీ బడ్జెట్ కాస్త తగ్గుతుంది. ఎవరికైనా గిఫ్ట్ (Gifts) లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎక్కువ బడ్జెట్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. తక్కువ బడ్జెట్లోనే ఉపయోగకరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవడం మేలు. ఆడవాళ్ళ షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్ తక్కువగా ఉండేట్లు ప్లాన్ చేసుకుంటే మగవారు మీతో షాపింగ్ రావడానికి ఇబ్బందిపడరు.

click me!