Vegetables: కూరగాయలను కడగకుండానే వండుతున్నారా? అయితే ప్రమాదమే!

Published : Feb 02, 2025, 03:17 PM IST

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. సాధారణంగా మనం కొన్నికూరగాయలను వండుకొని తింటాం. మరికొన్నింటిని పచ్చిగానే తింటుంటాం. కూరగాయలను మార్కెట్ నుంచి తేగానే పైన శుభ్రం చేసి వాడుకుంటాం. కానీ అసలు కథ కూరగాయల లోపలే ఉంది.

PREV
17
Vegetables: కూరగాయలను కడగకుండానే వండుతున్నారా? అయితే ప్రమాదమే!

మనకు రకరకాల కూరగాయలు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మనం వాటిని కొనుక్కొని వండుకొని తింటాం. బయట వరకు బాగానే కడుగుతాం. కానీ అసలు కూరగాయల లోపల ఏముందో ఒక్కోసారి గమనించం. అదే పెద్ద ఇబ్బందులకు దారి తీస్తుందట. అందుకే కూరగాయల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

27
ఆరోగ్య సమస్యలు..

సీజన్ మారే కొద్ది కూరగాయల్లో రకరకాల పురుగులు, క్రిములు చేరుతుంటాయి. కొన్నిసార్లు పైకి అవి ఫ్రెష్ గానే కనిపిస్తాయి. లోపల మాత్రం పురుగులు ఉంటాయి. హడావిడిలో ఒక్కోసారి మనం వాటిని చూసుకోకుండా తినేస్తుంటాం. దాంతో చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఏయే కూరగాయల్లో ఎక్కువగా పురుగులు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

37
క్యాబేజీలో..

క్యాబేజీలో ఎక్కువశాతం క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాబేజీ పొరలు పొరలుగా ఉంటుంది. చాలా వరకు ఆ పొరల్లో పురుగులు దాగి ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి క్యాబేజీని శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవడం మంచిది.

47
క్రిముల గుడ్లు ప్రమాదకరం

సాధారణంగా కూరగాయలపై ఉన్న క్రిములు, వాటి గుడ్లు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా క్రిముల గుడ్లు మెదడుకు హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

57
ఆకుకూరల్లో క్రిములు

ఆకుకూరల్లోనూ క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆకుకూరలను శుభ్రంగా కడగాలి. అప్పుడే పురుగుమందుల అవశేషాలతో పాటు ఇంకేమైనా బ్యాక్టిరియా ఉంటే పోతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

67
వేడి నీటితో కడగాలి

కూరగాయలపై ఉండే క్రిములను తొలగించడానికి వేడి నీటితో కడగడం మంచిది. మరీ ముఖ్యంగా ఆకుకూరలను వేడి నీటితో కడగడం వల్ల అవి శుభ్రంగా మారుతాయి.

77
కూరగాయల్లో క్రిముల గుడ్లు

సాధారణంగా వంకాయల్లో ఎక్కువగా పుచ్చులు ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించడం ముఖ్యం. వంకాయ లోపల పురుగులు ఉంటే పడేయడం మంచిది. క్యాప్సికం, పొట్లకాయల్లోనూ క్రిముల గుడ్లు ఉంటాయట. ఆ కూరగాయలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

click me!

Recommended Stories