SwaRail: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు మరింత ఈజీగా టిక్కెట్ బుకింగ్

Published : May 21, 2025, 10:45 AM IST

SwaRail : ప్రయాణికులకు సేవలను మరింత సులభతరం చేయడానికి భారతీయ రైల్వేస్ "స్వరైల్" (Swa Rail) అనే సూపర్ యాప్‌ను విడుదల చేసింది.  ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, రైలు సమాచారం, భోజనం, పర్యాటక ప్యాకేజీలు, లైవ్ ట్రాకింగ్ వంటి అనేక సేవలను పొందవచ్చు.

PREV
14
అన్నింటికీ ఒకే పరిష్కారం

రైలు ప్రయాణికుల అన్ని సమస్యలకు ’స్వరైల్ యాప్’  సరైన పరిష్కారం.  ప్రయాణికుల కోసం IRCTC స్వరైల్ యాప్‌ను విడుదల చేసింది. దీన్ని సూపర్ యాప్ అని కూడా పిలుస్తారు. స్వరైల్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు ఏయే ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

24
స్వరైల్ యాప్

ఒక చేతిలో లగేజ్, మరో చేతిలో మొబైల్ పట్టుకుని రైలు ఎప్పుడు వస్తుంది? ఏ ప్లాట్‌ఫారం? మన కోచ్ ఎక్కడ ఉంటుంది అని వెతుకుతుంటారు. మరికొందరు స్టేషన్‌లో రెస్ట్‌రూమ్ ఎక్కడ ఉందో కూడా వెతుకుతుంటారు. దీనికోసం రెండు మూడు యాప్‌లను వాడాల్సి వస్తుంది.

34
స్వరైల్ ఉపయోగాలు

రైల్యే ప్రయాణీకుల అన్ని సేవలను  ఒకే యాప్‌ను పరిచయం చేసింది.  రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ (CRIS) స్వరైల్ అనే కొత్త మొబైల్ యాప్‌ను పరిచయం చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ స్వరైల్ యాప్‌ను డౌన్‌లోడ్ (వెర్షన్ v127) చేసుకోవచ్చు. కానీ, ప్రస్తుతం ఆపిల్ యాప్ స్టోర్‌లో స్వరైల్ యాప్ అందుబాటులో లేదు.

44
అల్ ఇన్ వన్

రైల్యే ప్రయాణీకుల సౌలభ్యం కోసం..  రైల్వే సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫారమ్ కింద డిజిటలైజ్ చేయడం కోసం ఈ యాప్ ను రూపొందించారు. రైలు టికెట్ బుకింగ్, కార్గో బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ పాస్, రైలు ఎక్కడికి చేరిందో ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఈ సూపర్ యాప్‌లో ఉంటాయి. IRCTC లాగిన్‌తో ఈ యాప్‌ను వాడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories