వీటిని తింటే చాలు ముఖంపై ముడతలు పోయి.. నిత్య యవ్వనం మీ సొంతమవుతుంది..

First Published Sep 19, 2022, 3:03 PM IST

వయసు మీద పడుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలే కాదు.. శరీరం కూడా బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలైన తెల్లవెంట్రుకలు, చర్మంపై ముడతలు కనిపిస్తాయి. వీటిని ఆపడం అంత సులువు కాదు. కానీ కొన్ని సూపర్ ఫుడ్స్ వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిగా కనిపించేలా చేస్తాయి. 

ఎలాంటి సమస్యనైనా తగ్గించగలం, మొత్తమే రాకుండా జాగ్రత్తలు తీసుకోగలం కానీ.. వృద్ధాప్యాన్ని రాకుండా మాత్రం ఏం చేయలేము. వయసు పెరుగుతున్న కొద్దీ తెల్లజుట్ట, ముడతల చర్మం కనిపిస్తాయి.  వీటితో పాటుగా శరీర బలం కూడా తగ్గుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి రోగాలు రావు కానీ.. వృద్ధాప్యం మాత్రం పక్కాగా వస్తుంది. మీ వయసు మీద పడుతుందన్న సంగతిని ముందుగా మీ చర్మమే చెబుతుంది. అదికూడా ముడతల రూపంలో. అయినా ఈ ముడతలు జస్ట్ మార్పు అంతే. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఏడాదికి మారుతారు. అంటే అందం విషయంలో.  అలాగని వృద్ధాప్యం చర్మానికి హాని చేస్తుందని కాదు. అది ఒక ప్రక్రియ మాత్రమే. అయితే కొన్ని రకాల ఆహారాలు యాంటీ ఏజింగ్ గా పనిచేస్తాయి. దీనివల్ల కొంత వరకు వృద్ధాప్యాన్ని ఆపొచ్చు. వీటివల్ల మీరు నిత్యయవ్వనంగా కనిపిస్తారు. 

వయసు మీద పడుతున్న వారు ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఆక్సికరణ ఒత్తిడిని పెంచుతాయి. దీంతో ఫ్రీరాడికల్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే యాంటీ ఏజింగ్ గా పనిచేసే పండ్లు కూరగాయలను ఎక్కువగా తినాలి. నిత్యయవ్వనంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 
 

బీన్స్

రెడ్ కిడ్నీబీన్స్ లో యాంటీ ఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ లో పోరాడుతాయి. అలాగే ఆరోగ్యకరమైనన వృద్ధాప్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ముడతలను కూడా తగ్గిస్తుంది. 
 

టమాటాలు

టమాటాల్లో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమాటాలను రోజూ తినడం వల్ల ప్రస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందది. అలాగే కండరాల క్షీణతను కూడా నివారిస్తుంది. ఈ టమాటాలు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. 
 

బెర్రీస్

బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ  ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాణాంతకమైన గుండె జబ్బులను, క్యాన్సర్ లను తగ్గించడానికి సహాయపడతాయి. వయసును కూడా తగ్గిస్తాయి. 

ఎర్ర ద్రాక్ష

ఎరుపు ద్రాక్షలో క్వెర్సెటిన్, రెస్వెరాట్రాల్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. హార్ట్ పని తీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే రక్తణాలను బ్లాక్ చేయకుండా ఉంచడానికి సహాయపడతాయి. ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్, స్ట్రోక్ వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. 
 

దానిమ్మ పండ్లు

దానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. అంతేకాదు చర్మం యవ్వనంగా ఉంటుంది కూడా. 
 

click me!