ఉదయం పూట పాలు తాగే అలవాటుంటే వెంటనే మానుకోండి.. లేదంటేనా..?

First Published Sep 19, 2022, 2:08 PM IST

పాలు మన ఆరోగ్యానికి మంచివే.. కానీ వీటిని ఎప్పుడు తాగాలి? ఎప్పుడు తాగకూడదు వంటి విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఏరికోరి సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. 
 

చాలా మందికి ఉదయం పాలు తాగే అలవాటుంటుంది.  ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని.. ఇది మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుందని తాగుతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం టీ, కాఫీని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో.. ఉదయం పాలు తాగినా ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ఆయుర్వేదం ప్రకారం.. ఉదయం పాలు తాగడానికి బదులుగా తేలికపాటి ఆహారం తినడం మంచిది. ఎందుకంటే ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. దీనివల్ల శరీరం ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. చర్మానికి కూడా హాని జరుగుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు అంత తొందరగా జీర్ణం కావు. పాలను తాగితే జీర్ణవ్యవస్థపై పనిభారం ఎక్కువ అవుతుంది. దీంతో కడుపు నొప్పి, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, కడుపు తిమ్మిరి, వాంతులు మొదలైన సమస్యలు వస్తాయి. 

పాలు త్రాగడానికి ఉత్తమ సమయం ఏది?

ఆయుర్వేదం ప్రకారం.. పాలను సాయంత్రం పూట తాగడం మంచిది. ఈ సమయంలో పాలు త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఉదయాన్నే పాలు తాగడం వల్ల పొత్తికడుపు బరువు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ సాయంత్రం పూట తాగడం వల్ల హాయిగా నిద్రపోవడానికి, నరాలు సడలించడానికి సహాయపడుతుంది. ఇది అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

అయితే చిన్న పిల్లలకు కూడా పాలు చాలా మంచివి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలకు తాగిస్తుంటారు. కానీ పాలను ఎలా ఇవ్వాలో మాత్రం చాలా మందికి తెలియదు. దీంతో కొందరు పచ్చిపాలను అలాగే తాగేస్తుంటారు. మరికొంతమంది వేడి పాలలో చక్కెర వేసుకుని తాగుతుంటారు. నిజానికి పచ్చిపాలను, చక్కెర వేసిన పాలను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 

శుద్ది చేసిన చక్కెరను వేసుకుని పాలను తాగడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. అంటే వీటిని తాగడం వల్ల అసిడిటీ, మలబద్ధకం, డయేరియా, పైల్స్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. 
ముఖ్యంగా ఈ పాలు అంత తొందరగా జీర్ణం కావు. ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రపోయే సమయంలో  పాలు త్రాగడం వల్ల జీర్ణక్రియ మరింత కష్టమవుతుంది. ఇది కాస్త అజీర్ణం, మలబద్ధకానికి దారితీస్తుంది.

బరువు తగ్గడానికి భోజనం చేయడం మానేసి.. చక్కెర కలిపిన పాలను తాగే అలవాటుందా. అయితే మీరు ఎన్నిరోజులైనా బరువు తగ్గరు సరికదా.. మరింత పెరుగుతారు. ఎందుకంటే దీనిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలో బరువు పెరగడానికి , కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వుపాలను తాగండి. అదికూడా ప్రాసెస్ చేసిన చెక్కర లేకుండా.
 

గోరువెచ్చని పాలలో పంచదార కలపడం వల్ల పాలు రుచిగా అనిపించినప్పటికీ.. ఇలా తాగడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. కేవలం 1 టీస్పూన్ శుద్ధి చేసిన చక్కెరలో సుమారు 60 కేలరీలు ఉంటాయి. 1 గ్లాసు ఫుల్ క్రీమ్ పాలలో సుమారు 149 క్యాలరీలు ఉంటాయి. ఇక ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల కాలెయం ఉపరితలంపై కొవ్వు భాగా పేరుకుపోంది. దీంతో కాలెయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 

click me!