Summer Gardening Tips: కొత్తిమీర, పుదీనా మొక్కలు ఎండకు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

Published : Apr 01, 2026, 12:10 PM IST

Summer Gardening Tips: ఈ మండే ఎండలకు మీ ఇంట్లో కొత్తిమీర, పుదీనా, మెంతికూర మొక్కలు వాడిపోతున్నాయా? వాటిని పచ్చగా, ఫ్రెష్‍గా ఉంచాలంటే ఈ సమ్మర్ గార్డెనింగ్ టిప్స్ ట్రై చేసేయండి 

PREV
15
ఎంత నీరు పోసినా పాడవుతున్నాయా?

సమ్మర్ వచ్చిందంటే చాలు...ఇంట్లో పెంచుకునే మొక్కలు త్వరగా ఎండిపోతుంటాయి, ఎంత నీరు పోసినా కూడా ఫలితం ఉండదు. ముఖ్యంగా చాలా మంది ఇంట్లోనే కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పాలకూర, గోంగూర, కరివేపాకు వంటి ఆకుకూరలు పెంచుకుంటారు. వాటిని అప్పటికప్పుడు తుంచుకుని వంటల్లో వాడుకుంటుంటే ఆ ఆనందమే వేరు. ఎంతో ఇష్టంగా వాటిని పెంచుకుని మురిసిపోతారు.

25
వేసవిలో ఈ మొక్కలకు బాగా గిరాకీ

అయితే వేసవిలో ఈ మొక్కలకు బాగా గిరాకీ ఉంటుంది. దానివల్ల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లోనే పెంచుకోవడం ఉత్తమం. ఎండాకాలంలో మొక్కలు పెంచడమంటే ఒక సవాలేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వేడిగాలులకు, మొక్కలు తట్టుకోలేక వాడిపోతుంటాయి. అలా కాకుండా ఎంత ఉష్ణోగ్రతలు పెరిగినా కొత్తిమీర, పుదీనా వాడిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి. ఎప్పటికీ ఫ్రెష్‍గా ఉంటాయి. 

35
గత్తం వేస్తున్నారా?

నాణ్యమైన ఎరువును వాడాలి. మీరు ఒక థర్మోకోల్ కుండను ఉపయోగించి, దానిలో వానపాములు, ఆవు పేడ, మట్టిని కలిపి కంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇది మీ మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా కుళ్లిపోదు కూడా.

ఇక ఎండల నుంచి తట్టుకునేలా రెండు పొరలుగా వలను ఏర్పాటుచేసుకోండి. దాని వల్ల సూర్యరశ్మి నేరుగా పడదు, అలాగే ఆకులు కూడా ఎప్పటికీ పచ్చగా, ఫ్రెష్‍గా ఉంటాయి.

45
మొక్కను సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోండి

మీ కొత్తిమీర, పుదీనా మొక్కలకు ముందుగా డైరెక్ట్ గా ఎండ తగలకుండా చూసుకోండి. అలా సూర్యకిరణాలు పడని చోట పెట్టండి. వాటిని ఉదయం పూట కొద్దిసేపు ఎండ తగిలేలా చేసి ఆ తర్వాత మధ్యాహ్నం ఎండ తగలకుండా నీడలో ఉంచండి. కల్పించండి. 

55
నీరు ఎలా పెడుతున్నారు?

కొంతమందికి నీరు పోయడానికి సరైన సమయం తెలియదు. వేసవిలో మట్టి త్వరగా ఆరిపోతుంది, కాబట్టి మట్టి పై పొర ఆరిపోయిన వెంటనే క్రమం తప్పకుండా నీరు పోయాలి. అలా అని ఎక్కువ నీరు పోసేయకండి. దానివల్ల వేర్లు కుళ్లిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories