Millet Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. మిల్లెట్ ఇడ్లీ కూడా మెత్తగా రావాలా? ఈ చిన్న చిట్కా వాడితే చాలు

Published : Apr 01, 2026, 11:44 AM IST

Millet Idli: మిల్లెట్ ఇడ్లీ ఇంట్లో తయారు చేస్తుంటే గట్టిగా రాళ్లలా వస్తున్నాయా? తినడానికి రుచిగా లేవని.. మళ్లీ తెల్లటి ఇడ్లీలు తింటున్నారా? అయితే, ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. 

PREV
13
Millet Idli

సాధారణంగా మనం తినే తెల్లటి బియ్యం ఇడ్లీలు రుచిగా ఉన్నా, వాటిలో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ, నేటి కాలంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది మిల్లెట్ ఇడ్లీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ మిల్లెట్స్ ఇడ్లీ తయారు చేయడం అందరికీ రాదు. అవి గట్టిగా వస్తున్నాయని.. తినడానికి రుచిగా లేవని చెబుతుంది. వాటికి బదులు ఈ తెల్ల ఇడ్లీ తినడమే బెటర్ అని ఫీలౌతుంటారు. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మిల్లెట్స్ ఇడ్లీ కూడా మెత్తగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

23
మిల్లెట్ ఇడ్లీ మెత్తగా రావాలంటే చేయాల్సింది ఇదే...

నానపెట్టే సమయం.. మిల్లెట్స్ ( రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు) బియ్యం కంటే గట్టిగా ఉంటాయి. కాబట్టి, వీటిని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టాలి. అంతేకాదు.. వీటితో పాటు.. మినపప్పు కూడా 6 నుంచి 8 గంటలు నానపెట్టుకోవాలి. అప్పుడు.. పిండి మెత్తగా రుబ్బుకోవడానికి సహాయపడుతుంది.

ఇక పిండి రుబ్బుకునే సమయంలో లేదా పప్పులు నానపెట్టే సమయంలో ఒక టీ స్పూన్ మెంతులు తప్పనిసరిగా కలపాలి. ఇవి పిండి బాగా పులియడానికి, ఇడ్లీలు మెత్తగా రావడానికి సహాయపడతాయి. అదేవిధంగా మిల్లెట్స్ రుబ్బుకునేటప్పుడు కొద్దిగా నానపెట్టిన అటుకులు లేదా వండిన అన్నం కలిపితే.. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి.

అంతేకాదు.. ఇడ్లీ తయారు చేయడానికి మినపప్పు, మిల్లెట్స్ ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఒక కప్పు మినపప్పు నానపెడితే.. 3 వంతుల మిల్లెట్స్ తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న పప్పు తీసుకుంటే.. ఇడ్లీలు చాలా రుచిగా వస్తాయి. పిండి రుబ్బుకున్న తర్వాత కనీసం 8 నుంచి 10 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

33
తెల్లటి ఇడ్లీలకు బదులు మిల్లెట్ ఇడ్లీలు ఎందుకు తినాలి?

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI): మిల్లెట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు (Diabetics) ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.

పీచు పదార్థం (Fiber Rich): తెల్ల బియ్యంతో పోలిస్తే మిల్లెట్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

బరువు తగ్గడానికి: మిల్లెట్ ఇడ్లీలు తింటే కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది, తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

ప్రోటీన్ , ఖనిజాలు: వీటిలో కాల్షియం, మెగ్నీషియం , ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, రక్తహీనత తగ్గడానికి తోడ్పడతాయి.

గ్లూటెన్ ఫ్రీ: మిల్లెట్స్ సహజంగానే గ్లూటెన్ ఫ్రీ, కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా వీటిని నిశ్చింతగా తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories