వేసవిలో డేటింగా? అబ్బా ఉక్క.. అనుకుంటున్నారా?? ఈ ఐడియాస్ ట్రై చేయండి...

First Published May 14, 2022, 1:00 PM IST

వేసవిలో డేటింగ్ అంటే ఆ ఉక్కలో ఎలా అనే ఆలోచన వస్తుంది. ఏసీ గదులకు పరిమితం అవుతారు. అలా కాకుండా వేసవి రాత్రుళ్లో కూడా ఎంచక్కా ఎంజాయ్ చేసే ఐడియాలు మీ ప్రేమజంట కోసం చూడండి...

కరవోకో నైట్ 
విచిత్రంగా వినిపించింది కదా.. కానీ ఈ సారి ఇలా ట్రైచేయండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కరావొకే నైట్ లో మీకు నచ్చిన ప్రదేశం చూసుకుని కూర్చోండి. మీ ఇద్దరికీ ఇష్టమైన పాటలు ఎంచుకుని రాత్రంగా వింటూ, ఇద్దరూ కలిసి పాడుతూ ఉండండి. 

బిబిక్యూ నైట్
మీ ప్రత్యేకమైన వ్యక్తులతో గడపడానికి బిబిక్యూ నైట్ ఎంచుకోండి. మీ ఇంటి పెరట్లోనో, బాల్కనీలోనో ఓ బార్బిక్యూ సెటప్ ను ఏర్పాటు చేసి.. మీ పార్టనర్ ను పిలవండి. రాత్రంతా ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ చికెన్, వెజిటెబుల్స్ బార్బిక్యూ చేస్తూ ఎంజాయ్ చేయండి. 

స్పెషల్ డిన్నర్ డేట్
మీ ఇద్దరికీ ఇష్టమైన ఓ రెస్టారెంట్ లో స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేయండి. మీ కిష్టమైన ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేసి వాటితో ఎంజాయ్ చేయండి. అయితే ముందుగానే అరెంజ్ మెంట్స్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవు. 

భోగిమంట 
వేసవిలో భోగిమంట ఏంటా అనుకుంటున్నారా? వేసవి సాయంత్రాలు ఆరుబయట మంటవేసి దానికి కాస్త దూరంగా కూర్చుని డ్రింక్స్, ఫుడ్స్ తో ఎంజాయ్ చేయడం బాగుంటుంది. దీనికి తగ్గట్టుగా మంచి మ్యూజిక్, డ్యాన్స్ మీ మూడ్ ను అద్భుతంగా మార్చేస్తుంది. 

చుక్కలు చూపించండి
బ్లాంకెట్లు, మెత్తలు, ఆహారం ప్యాక్ చేసుకోండి. వీటితో పాటు ఓ టెలీస్కోప్ అరెంజ్ చేసుకోండి. వేసవి రాత్రుళ్లు ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా ఉంటాయి. మీరు ఇద్దరే ఎవ్వరూ లేని చోటికి వెళ్లి రాత్రంతా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి చుక్కల్ని చూస్తూ.. కబుర్లతో గడిపేయండి.

డ్రైవ్ ఇన్ థియేటర్
చాలామంది ఈ ఐడియాను అంతగా ఇష్టపడరు. అయితే, నిజానికి ఇది చాలామంచి ఐడియా.. వేసవి సాయంత్రాలకు చక్కగా సరిపోయే రొమాంటిక్ ఆలోచన. 

lovers

సూర్తాస్తమయంలో స్విమ్మింగ్ పూల్ లో...
సాయంత్రం వేళ ఇద్దరూ కలిసి ఎంచక్కా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేయండి. ఇది మిమ్మల్ని చక్కగా రిలాక్స్ చేస్తుంది. దీనికి సూర్యాస్తమయం చక్కటి సమయం.

ఇద్దరూ కలిసి వంట
ఇద్దరూ కలిసి వంటగదిలో ఓ చక్కటి డిష్ ను తయారు చేస్తూ ఎంజాయ్ చేయండి. దీనికోసం ముందుగానే ఓ డిష్ ను ఎంచుకోండి. చేసేప్పుడు రొమాంటిక్ మ్యూజిక్, వైన్ ఉంటే ఆహా...

క్యాంపింగ్
మీకు దగ్గర్లో ఏదైనా ప్రకృతి సహజమైన పర్యాటక ప్రాంతంలాంటిది ఉంటే అక్కడ ఓవర్ నైట్ క్యాంప్ వేయడానికి ట్రై చేయండి. టైంటు ముందు మంట వేసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేయండి. 

click me!