Shani Trayodashi: నేడే 'శని త్రయోదశి'. శనిదేవుడిని ఎలా పూజిస్తే.. సకల సౌభాగ్యాలు మీ వెంటే..!

First Published | May 14, 2022, 11:29 AM IST

Shani Trayodashi: నేడే శని త్రయోదశి. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున శని దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే మీకు పట్టుకున్న శని అంతా వదిలిపోయి.. సుఖ: సంతోషాలతో ఉంటారు.  

శని వారానికి అధిపతిగా శనిదేవుడిని కొలుస్తారు. మనం పూర్వజన్మలో చేసిన పాపాలకు సైతం శిక్షించే అధికారం శనిదేవుడికి ఉందంటారు జ్యోతిష్యులు. శని కేవలం మీరు చేసిన దుష్కర్మలకే మాత్రమే శిక్షిను విధిస్తాడు. శని కేవలం మనకు దండనను విధించడమే కాదు మన పాపాలను కడిగే దేవుడు కూడా. 
 

త్రయోదశి శనివారం నాడు వస్తే.. ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తుంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వరస్వామికి మనం పూజలు చేస్తుంటాం. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటున్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని.. తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతారు.
 

Latest Videos


పురాణాలు, హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఈ రోజున అశ్వత్థ వృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి.
 

జాతక రీత్యా శనేశ్వరుని ప్రభావం వలన కష్టాలు పడుతున్న వారు.. ఈ శని త్రయోదశి రోజును గుర్తు పెట్టుకుని విధులు నిర్వహించాలి.  సూర్యోదయమునకు పూర్వమే శనేశ్వరునికీ నువ్వుల నూనె, నువ్వుల తోను ఆభిషేకం చేసి నీలిరంగు పూలతో భక్తి పూర్వకంగా అర్చించవలెను. బెల్లమును నైవేద్యముగా సమర్పించాలి.  నల్లని లేదా నీలం వస్త్రమును సమర్పించవలెను. నల్ల నువ్వులను దానమిచ్చుట వలన కూడా శని ప్రసన్నుడై తన ప్రభావమును తగ్గించును.

shanidev 001

అలాగే శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి

 ‘‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..

    ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్‌’’

మరో విషయం గుర్తు పెట్టుకోవాలి...

శనేశ్వరుడు ఎంత ఇబ్బందులు కలిగిస్తాడో మన జీవితంలో  కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కలిగిస్తాడు. ఛాయా దేవి, సూర్య భగవానుల పుత్రుడైన శని. కుంభ, మకర రాశులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
 

వాహనం: కాకి
అదిదేవత : యముడు
ప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం 

click me!