నిజానికి గ్రీన్ టీ లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ , మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి జబ్బులు సోకే ప్రమాదం తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. గ్రీన్ టీ చర్మ ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయినప్పటికీ గ్రీన్ టీని బరువు తగ్గించే పానీయంగానే భావిస్తారు చాలా మంది. మరి ఈ గ్రీన్ టీ బరువు తగ్గేందుకు నిజంగానే సహాయపడుతుందా ? లేదా ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.