ఈ డ్రింక్ తాగితే.. రాత్రికి రాత్రే దగ్గుమాయం...!

First Published | Sep 24, 2024, 10:48 AM IST

కేవలం ఇంట్లో తయారు చేసే ఈ కషాయం తాగితే.. ఈజీగా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి.. ఆ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 

cough

వాతావరణం పూర్తిగా మారిపోయింది. కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. అందరూ జలుబు, దగ్గు, జ్వరాల బారినపడుతున్నారు. జ్వరం అయినా.. ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుంది. కానీ... జలుబు, దగ్గు మాత్రం అంత తొందరగా వదలవు. డాక్టర్స్ రాసి ఇచ్చిన దగ్గు మందు తాగినా కూడా చాలా మందికి కనీసం ఉపశమనం కూడా లభించదు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో దగ్గు చాలా ఇబ్బంది పెడుతుంది. అస్సలు నిద్ర కూడా పోనివ్వదు. మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే.. కేవలం ఇంట్లో తయారు చేసే ఈ కషాయం తాగితే.. ఈజీగా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి.. ఆ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

cough syrup


నిజానికి ఇప్పుడంటే చిన్న సమస్య వచ్చినా... హాస్పిటల్స్ కి పరిగెత్తడం, మందులు మింగడం లాంటివి చేస్తున్నాం కానీ.. పూర్వం ఇవేమీ ఉండేవికావు. అందుకే వాళ్లు వంటింటిపై ఆధారపడేవారు. వంటింట్లో దొరికే కొన్ని వస్తువులు.. మనకు వచ్చే చాలా రకాల జబ్బులను ఈజీగా తొలగించగలవు. అందులోనూ జలబు, దగ్గులను అయితే మరింత ఈజీగా తరిమేయవచ్చు. కేవలం.. ఒక పదినిమిషాలు సమయం కేటాయించి.. కషాయం తయారు చేసుకుంటే చాలు. మరి.. ఆ కషాయం తయారు చేయడానికి ఏం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..



1.అల్లం రసం..
దాదాపు అందరు ఇళ్లల్లో అల్లం ఉంటుంది. దాని రసం తాజాగా తీసీ తాగితే దగ్గు మాయం అయిపోతుంది.  ఎందుకంటే.. ఈ అల్లం రసంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. శ్వాసకోస వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడటంలో సహాయం చేస్తుంది. దగ్గు,గొంతులో దురద, నొప్పి లాంటివి ఏమి ఉన్నా.. ఈజీగా తగ్గించేస్తుంది. అంతేకాదు.. ఛాతిలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కూడా తగ్గించడంలో అల్లం రసం బాగా పని చేస్తుంది.అల్లంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది అలెర్జీల ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది.

అల్లం రసం డైరెక్ట్ గా తాగాలి అంటే కాస్త కష్టమే. మఖ్యంగా చిన్న పిల్లలు అస్సలు మింగలేరు. అందుకే.. దానితో కషయాన్ని తయారు చేయాలి. అల్లంతో పాటు.. నిమ్మరసం, తేనె వాడితే సరిపోతుంది.

ginger garlic

ముందుగా అల్లం శుభ్రం చేసి.. దానిపైన పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు నీరు చేర్చి.. బ్లెండర్ లో మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత.. దానిని ఫిల్టర్ సహాయంతో.. రసం, పిప్పిని వేరు చేయాలి. ఇప్పుడు ఆ రసానికి నిమ్మరసం, తేనె కలపాలి. అంతే... మన దగ్గుకు మందు తయారైనట్లే. దీనిని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు తాగినా పర్వాలేదు. ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. దగ్గు నుంచి మీకు ఉపశమనం ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం వేడి చేసుకొని కూడా తాగొచ్చు. వేడిగా తాగితే.. అది తాగే సమయంలోనూ గొంతుకు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది.

Latest Videos

click me!