ఇలాంటి కలలు పడితే మీరు ధనవంతులవ్వడం ఖాయం

Published : Dec 03, 2023, 02:44 PM IST

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి కలకూ ఏదో ఒక అర్థం ఉంటుంది. ఎన్నో కలలు మంచివి. మరెన్నో కలలు =అశుభమైనవి. కలలు మన భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి సూచిస్తాయని చెబుతారు. అయితే మనం ధనవంతులం కాబోతున్నామని సంకేతం ఇచ్చే కొన్ని కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
ఇలాంటి కలలు పడితే మీరు ధనవంతులవ్వడం ఖాయం

కలలు రావడం చాలా సహజం. మనలో చాలా మందికి ప్రతి రోజూ ఏదో ఒక కల పడుతూ ఉంటుంది. మరికొంతమందికి ఎప్పుడో ఒకసారి కల పడుతుంటుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కలకూ ఏదో ఒక అర్థం ఉంటుంది. కొన్ని కలలు మనకు మంచి రోజులను సూచిస్తే.. మరికొన్ని కలలు మనకు చెడు రోజులను సూచిస్తాయి. కలలు మన భవిష్యత్తును సూచిస్తాయంటారు జ్యోతిష్యులు. మరి మనం ధనవంతులం కాబోతున్నట్టు సూచించే కొన్ని కలల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

24

ఎత్తైన ప్రదేశంలో మిమ్మల్ని మీరు చూడటం

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు కలలో ఒక చెట్టు లేదా మరేదైనా ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహిస్తే.. మీరు రాబోయే కాలంలో అంతా శుభమే జరుగుతుందని అర్థం. అంటే మీరు పని రంగంలో పురోగతి, ఎన్నో పెద్ద  ప్రయోజనాలను పొందబోతున్నారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. 

34

ఆలయాన్ని చూడటం

కలలో ఆలయాన్ని చూడటం ఎంతో శుభసూచకమని డ్రీమ్ సైన్స్ చెబుతోంది.ఇలాంటి కల పడితే మీరు పడుతున్న కష్టాలన్నీ త్వరలోనే ముగియబోతున్నాయని అర్థం. అలాగే దేవుని అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. సప్న శాస్త్రం ప్రకారం.. ఇలాంటి కలలు కంటే మీరు అదృష్టవంతులని సూచిస్తుంది.
 

44

కలలో వర్షం పడటం

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు మీ కలలో వర్షం పడటం చూస్తే.. మీకు అంతా మంచే జరుగుతుందని అర్థం. ఈ కల మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న మీ ఆర్థిక సమస్యలు తొలగిపోబోతున్నాయని సూచిస్తుంది. ఇలాంటి కలలు మీకు పడితే మీరు ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఈ కల మీ ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది.
 

click me!

Recommended Stories