వివాహ పంచమి నాడు పెళ్లిళ్లు ఎందుకు చేయరు?

First Published | Dec 3, 2023, 9:46 AM IST

vivah panchami 2023: త్రేతాయుగంలో మార్గశిర్ష మాసం శుక్ల పక్షం ఐదో రోజున శ్రీరాముడు, సీతాదేవి వివాహం చేసుకున్నట్టు పురాణాలలో పేర్కొనబడింది. అందుకే ఈ తేదీకి అంత ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ తేదీన వివాహం చేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు. ఎందుకంటే?
 

vivah panchami 2023: ప్రతి ఏడాది మార్గశిర్ష మాసం శుక్ల పక్షం ఐదో రోజున వివాహ పంచమి పండుగను జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారం.. త్రేతాయుగంలో రాముడు, సీతాదేవి ఈ రోజునే వివాహం చేసుకున్నారు. కానీ ఈ తేదీన పెళ్లి చేసుకోవడం శుభపరిణామం కాదని కూడా నమ్ముతారు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వివాహ పంచమి శుభ ముహూర్తం 

మార్గశిర్ష మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజు అంటే డిసెంబర్ 16 రాత్రి 08 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే పంచమి తిథి డిసెంబర్ 17 సాయంత్రం 05:33 గంటలకు ముగుస్తుంది. ఉగాది తిథి ప్రకారం డిసెంబర్ 17వ తేదీ అంటే ఆదివారం వివాహ పంచమిని జరుపుకుంటారు.
 


వివాహ పంచమి ప్రాముఖ్యత 

రాముడు, సీతదేవి జంటను హిందూ మతంలో ఆదర్శ వైవాహిక జంటగా చూస్తారు. ఆరాధిస్తారు. మార్గశిర్ష మాసంలోని శుక్లపక్షంలో ఐదో రోజున వివాహం జరగడం వలన ఈ రోజును శ్రీరాముడు, సీతాదేవి వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున సీతాదేవిని, రాముడిని ఆరాధించే భక్తుల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతారు.
 

ఈ రోజు పెళ్లి ఎందుకు చేసుకోరంటే? 

మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున వివాహం చేసుకున్న తర్వాత శ్రీరాముడు, సీతాదేవి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అంటే శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్లాడు.అంతేకాకుండా వనవాసం పూర్తయిన తర్వాత కూడా సీతాదేవి అడవిలోనే ఉండాల్సి వచ్చింది. అందుకే ఈ తేదీలో పెళ్లి చేసుకోవడం శుభప్రదంగా భావించరు.

Latest Videos

click me!